ములుగు రూరల్: ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆశ వర్కర్ల వేతనాలు పెంచుతామని మంత్రి సీతక్క హామీ ఇచ్చినట్లు ఆ సంఘం నాయకులు తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాల ని.. లేని పక్షంలో వచ్చేనెల 15 నుంచి నిరవధిక సమ్మె చేపడుతామని పేర్కొంటూ మంగళవారం ములుగులో మంత్రికి సమ్మె నోటీస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ల డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు వారు వెల్లడించా రు. ఈ సందర్భంగా సంఘం జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 28 వేల మంది ఆశా వర్కర్లు 20 ఏళ్లుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సేవలందిస్తున్నారని తెలిపా రు. ఆశ వర్కర్లకు ప్రస్తుతం నెలకు కేవలం రూ.9,900 పారితోషకం మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. ఐదేళ్లుగా వేతనాలు పెరగలేదని తెలిపా రు. రూ. 18వేలు వేతనం చెల్లించాలని కోరారు.


