– మరిన్ని కథనాలు 9లోu
● జూనియర్ సివిల్ జడ్జిగా అశ్విని
రఘునాథపల్లి: జిల్లాలోని రఘునాథపల్లికి చెందిన నోముల పార్వతి–యాకయ్యది వ్యవసాయాధార కుటుంబం. సమాజంలో విద్య లేకపోతే ఎదురయ్యే ఇబ్బందులను స్వయంగా అనుభవించిన ఆ దంపతులు కూతురిని సమాజానికి ఉపయోగపడే ఉన్నత స్థానంలో చూడాలని కలలు కన్నారు. వారి కాష్టాన్ని, త్యాగాలను అర్దం చేసుకున్న అశ్విని ఆహర్నిశలు శ్రమించి ఏడాది క్రితం వనపర్తి జూనియర్ సివిల్ జడ్జిగా ఎంపికయ్యారు. విజయవంతంగా బాధ్యతలు నిర్వరిస్తున్నారు. ‘కూతురు న్యాయమూర్తి కావాలన్న మా అశను తను నెరవేర్చింది. ఏడాది కాలంగా జడ్జిగా సేవలు అందిస్తున్న మా బిడ్డను చూస్తేంటే కడుపు నిండిపోతుంది. కూతుర్ల దినోత్సం వేళ ఒక కూతురిగా తను మాకు ఇచ్చిన అతి పెద్ద బహుమతి’అని అశ్విని తల్లిదండ్రులు పార్వతి, యాకయ్య ఎంతో ఆనందంగా తెలిపారు.


