జిల్లాకు రూ.27 కోట్ల వరాలు | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు రూ.27 కోట్ల వరాలు

Sep 27 2026 1:04 AM | Updated on Sep 27 2026 1:04 AM

జనగామ: జిల్లాలో పేదల కోసం అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసి నివాసయోగ్యంగా తీర్చిదిద్దేందుకు రూ.2 కోట్లతో పాటు మున్సిపాలిటీకి మరో రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్టన్‌ కళాశాల గ్రౌండ్‌లో ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమ సభలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝాతో కలిసి మంత్రి మాట్లాడారు.. గత ప్రభుత్వ హయాంలో వివిధ కారణాలతో నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోయిన ఇళ్లను గుర్తించి వాటిని పూర్తి చేసి పేద కుటుంబాలకు అందుబాటులోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. ఒక్క జనగామ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో నిర్మాణాలు పూర్తికాక ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తిస్తున్నామని చెప్పారు. జనగామకు సంబంధించి అసంపూర్తిగా ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వచ్చే దసరా నాటికి ఇళ్లు నివాసయోగ్యంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జనగామ జిల్లాలో సుమారు 500 కుటుంబాలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నాయని, వచ్చే దసరా నాటికి ఇందులో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునేలా మంజూరు చేస్తామని మంత్రి ప్రకటించారు.

మొండి గోడలు, స్లాబ్‌ స్థాయిలో నిలిచిపోతే

ఆర్థిక పరిస్థితుల కారణంగా మొండి గోడల వద్ద, స్లాబ్‌ స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లను కూడా పరిశీలించి రూ.2లక్షల నుంచి రూ.3 లక్షల వరకు సాయం అందిస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. మూడు నాలుగు విడతల్లోనూ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ స్థలాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఏ గ్రామంలో, ఏ మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఇళ్ల స్థలాలు అందుబాటులో ఉన్నాయో వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. మూడో విడతలో ఆయా ప్లాట్లకు ఇళ్లను కూడా మంజూరు చేసే కార్యక్రమం చేపడతామని తెలిపారు. జనగామ మున్సిపాలిటీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు దసరా నాటికి రూ.25 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులను వెంటనే మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. కేంద్రం నుంచి తుది బిల్లుల విషయంలో ఆలస్యం జరిగిన సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి చెల్లింపులు చేసిందన్నారు. అనంతరం 500 మంది అర్హులైన లబ్ధిదారులకు ఇంది రమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను మంత్రి చేతుల మీ దుగా అందించారు. కార్యక్రమంలో డీసీపీ రాజమ హేంద్రనాయక్‌, రెవెన్యూ అదనపు కలెక్టర్‌ బెన్‌షాలోమ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి, ఏ ఎంసీ చైర్మన్‌ బనుక శివరాజ్‌ యాదవ్‌, డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి నాయక్‌, వైటీడీఏ సభ్యులు డాక్టర్‌ లక్ష్మీనారాయణ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

అసంపూర్తి ఇళ్లకు రూ.2 కోట్లు

మున్సిపాలిటీకి రూ.25 కోట్లు

పూరిగుడిసెల కుటుంబాలకు

రూ.5 లక్షలతో ఇందిరమ్మ ఇళ్లు

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement