జనగామ: సామాజిక న్యాయం కోసం ప్రశ్నించిన రాహుల్ గాంఽధీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధన్వంతి మండిపడ్డారు. హల్ద్వానీలో జరిగిన కులతత్వ ఘటనకు వ్యతిరేకంగా, సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం గళమెత్తిన లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ బీజేపీ ప్రభుత్వం నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ధన్వంతి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైటీడీ మెంబర్ డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్ మాట్లాడుతూ.. కుల వివక్ష, సామాజిక అన్యాయంపై ప్రశ్నించడం నేరం కాదని అన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ వేమల్ల సత్యనారాయణరెడ్డి, ఓ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు లోకుంట్ల ప్రవీణ్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేముల మల్లేష్, చింతకింది మల్లేష్, ఎదునూరి రవీందర్, డీసీసీ సహాయ కార్యదర్శి లింగాల రాజేందర్‌రెడ్డి, జాయ మల్లేష్, కళ్యాణం సమ్మయ్య, దండు శ్రీనివాస్, గార్లపాటి మహిపాల్‌రెడ్డి, వార్డు అధ్యక్షులు జనార్దన్, కొండా మల్లేష్, దామోదర్ రెడ్డి, నోముల సోమయ్య, నోముల హరీష్, రామగాళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన


