అడ్రస్‌ తప్పుగా పడింది.. | - | Sakshi
Sakshi News home page

అడ్రస్‌ తప్పుగా పడింది..

Sep 1 2026 1:13 AM | Updated on Sep 1 2026 1:13 AM

అడ్రస్‌ తప్పుగా పడింది.. తప్పులు సవరించాలి.. తల్లిగారి ఇంటిపేరు వచ్చింది.. పేరు రాలేదు..

వారం రోజుల క్రితం స్మార్ట్‌ రేషన్‌ కార్డు తీసుకున్నాను. కార్డులో శివునిపల్లి చిరునామాకు బదులుగా సముద్రాల అని నమోదైంది. ఈ విషయంపై అధికారులను అడిగినా సరైన సమాధానం లభించలేదు.

– చిలగాని పారిజాతం,

శివునిపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్‌

మా ఇంటిపేరు ముస్కు. కానీ స్మార్ట్‌ రేషన్‌ కార్డులో మా తల్లిదండ్రుల ఇంటి పేరు చెంచుగా నమోదైంది. తప్పుగా ఉన్న ఇంటిపేరును సరిచేసి కొత్త కార్డు ఇవ్వాలి.

– ముస్కు మానస,

రాఘవపురం, పాలకుర్తి

స్మార్ట్‌ రేషన్‌ కార్డులో కుటుంబ సభ్యుల వివరాలు నమోదయ్యాయి. అయితే నా భార్యకు అత్తవారింటి ఇంటిపేరు రావాల్సి ఉండగా తల్లి ఇంటిపేరు నమోదైంది. ఈ వివరాలను వెంటనే సవరించాలి.

– వ్యాసారపు కర్ణాకర్‌,

చౌడారం, జనగామ

స్మార్ట్‌ రేషన్‌ కార్డులో ఇంటిపేరు తప్ప.. అసలు పేరు రాలేదు. భార్య లక్ష్మి పేరుతో స్మార్ట్‌కార్డు రాగా, యజమాని పేరు లేకుండా కేవలం ఇంటి పేరుతో రావడంతో ఆందోళనగా ఉంది.

– రాజారపు రామస్వామి, చిల్పూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement