లంచం అడిగితే ఫోన్‌ చేయండి | - | Sakshi
Sakshi News home page

లంచం అడిగితే ఫోన్‌ చేయండి

Sep 1 2026 1:13 AM | Updated on Sep 1 2026 1:13 AM

నర్మెట(తరిగొప్పుల): రైతుల సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యమని, సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారులను ఎవరైనా లంచం అడిగితే తనకు నేరుగా ఫోన్‌ చేయాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి సూచించారు. మండలంలోని బొంతగట్టు నాగారం, బొత్తలపర్రె, జాలుబాయితండా, బోజ్య తండా, కొత్తతండా, వాచ్యతండా, అంకుషాపూర్‌, షోలీపూర్‌, అక్కరాజుపల్లిలలో వీఓ భవనాల నిర్మాణ పనులకు సోమవారం భూమి పూజలు నిర్వహించిన ఆయన మాట్లాడారు.. ఎత్తైన ప్రాంతాలకు పైపులైను ద్వారా నీరందించేందుకు అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటానన్నారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పనులను దసరా నాటికి పూర్తిచేసి నీరు అందిస్తామని తెలిపారు. సర్పంచ్‌లు కుర్రె మల్లయ్య, భూక్య రవి, సుగుణ, సభావత్‌ అలుపతి, నర్సయ్య, మంచినీళ్ళ రాజు, బైకాని రమ, దండెం శ్రీనివాస్‌, పింగిళి జగన్మోహన్‌రెడ్డి, లింగం, వెంకట్‌రెడ్డి, రాజేశ్వర్‌, జుంలాల్‌, యాదగిరి, ప్రభుదాస్‌ పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement