జనగామ రూరల్: పట్టణంలో మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా మంగళవారం ఎస్‌ఐలు భరత్, రతీష్, చెన్నకేశవులు, నర్సయ్య, పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్ బృందం సీఐ ఆకస్మిక నార్కోటిక్స్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనగామ బస్టాండ్‌తో పాటు పట్టణంలోని అనుమానాస్పద ప్రాంతాలు, అనుమానిత వ్యక్తులను డాగ్ స్క్వాడ్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, నిల్వ, వినియోగాన్ని అరికట్టే లక్ష్యంతో ఈ తనిఖీలు చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో మాదకద్రవ్యాలకు సంబంధించిన కార్యకలాపాలు గమనించినట్లయితే వెంటనే సమాచారం అందించి సహకరించాలని కోరారు.


