నాణ్యతా ప్రమాణాలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి

Jun 24 2026 12:59 AM | Updated on Jun 24 2026 12:59 AM

జనగామ రూరల్‌: పట్టణంలోని హైదరాబాద్‌ మెయిన్‌ రోడ్డు నుంచి వెళ్లే వరద నీటి డ్రెయినేజీ పనులను మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ కడకంచి బాలమణి శ్రీనివాస్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌రెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. పట్టణంలోని ఎగువ ప్రాంతాలైన బాణాపురం, రంగప్ప చెరువు, గవర్నమెంట్‌ హాస్పిటల్‌ ఏరియా, కురుమవాడ, రైల్వేస్టేషన్‌ ప్రాంతాల నుంచి వర్షాలు పడినప్పుడు వచ్చే వరద నీరు వల్ల హైదరాబాద్‌ మెయిన్‌ రోడ్‌ బాలాజీ నగర్‌, జ్యోతినగర్‌ వరదలో ముంపునకు గురి అవుతున్న పరిస్థితి ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. రూ.9.10 కోట్లతో నిర్మించనున్న స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్‌ పనులు ప్రారంభమైయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు బూడిది జ్యోతి, మంత్రి సుమలత, పానుగంటి సువార్త, మున్సిపల్‌ ఏఈ అనిల్‌, సంబంధిత వర్క్‌ కాంట్రాక్టర్‌ దోర్నాల శశికాంత్‌ పాల్గొన్నారు.

రోగులకు మెరుగైన

సేవలు అందించాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌: రోగులకు మెరుగైన సేవలు అందించేలా వైద్య సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అఽధికారి డాక్టర్‌ మల్లికార్జున్‌రావు సూచించారు. మండలంలోని ఇప్పగూడెం పీహెచ్‌సీని మంగళవారం ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి పరిసరాలను, ల్యాబ్‌ను తనిఖీ చేశారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బందికి చెందిన రిజిష్టర్లను పరిశీలించారు. ప్రతీ రోజూ ఓపీ ఎంత ఉంటుందని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీహెచ్‌సీలో నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యురాలు సాయిప్రణీత, ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అశోక్‌, డాక్టర్‌ కమల్‌హాసన్‌, పీహెచ్‌ఎన్‌ రమణ, సూపర్‌వైజర్‌ సత్యం, ఎంఎల్‌హెచ్‌పీలు రమ్యకృష్ణ, రాజేశ్వరి, స్టాఫ్‌నర్సు లావణ్య, ఏఎన్‌ఎం రాజ్యలక్ష్మీ, ల్యాబ్‌ టెక్నీషియన్‌ సునీల్‌కుమార్‌ పాల్గొన్నారు.

సమయపాలన పాటించండి

డిప్యూటీ డీఎంహెచ్‌ఓ వాణిశ్రీ

నర్మెట: సమయ పాలన పాటించి మెరుగైన వైద్యసేవలు అందించాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, పీఓ ఎంసీహెచ్‌ డాక్టర్‌ వాణిశ్రీ (స్టే.ఘన్‌పూర్‌ డివిజన్‌) సిబ్బందికి సూచించారు. స్థానిక పీహెచ్‌సీని మంగళవారం ఆకస్మిక తనిఖీ చేసిన ఆమె రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రులలోనే ప్రసవాలు జరిగేలా చూడాలని, మాతా శిశు సంరక్షణపై దృష్టి సారించాలని, గర్భిణులు, బాలింతల వివరాలను వంద శాతం నమోదు చేయాలన్నారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విధిగా నిర్వహించాలని సూచించారు. ఆమె వెంట వైద్యాఽధికారులు ఎట్టిరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డి, ముక్కా సుకన్య, మోహి సిద్దిఖి తదితరులు ఉన్నారు.

రేపు తెలంగాణ కామర్స్‌

అసోసియేషన్‌ సదస్సు

కేయూ క్యాంపస్‌: తెలంగాణ కామర్స్‌ అసోసియేషన్‌ 7వ వార్షిక సదస్సును ఈనెల 25న కేయూలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలో నిర్వహించనున్నారు. వర్సిటీ కాలేజీ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ కామర్స్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో వికసిత్‌భారత్‌–47 న్యూ డైమన్షన్స్‌ ఇన్‌ కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌ ది ఎరా ఆఫ్‌ యాక్ట్‌’ అంశంపై ఈసదస్సును నిర్వహించనున్నారు. సదస్సులో కృత్రిమ మేధ ప్రభావం, వ్యాపార విశ్లేషణ, ఆర్థిక రంగం, ఫిన్‌టిక్‌ స్టార్టప్‌లు, మార్కెటింగ్‌పై చర్చలు జరగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ వి.బాలకిష్టారెడ్డి, విశిష్ట అతిథిగా కేయూ వీసీ కె.ప్రతాప్‌రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. ప్రొఫెసర్‌ హెచ్‌.వీ స్మారకోపన్యాసం ఉంటుందని కన్వీనర్‌ ఫణీంద్రకుమార్‌, కోకన్వీనర్‌ బి.ప్రగతి తెలిపారు. ముగింపు సభకు రిజిస్ట్రార్‌ రామచంద్రం, ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ ఘనశ్యామ్‌ సోలంకి హాజరవుతారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement