● విద్యార్థులకు డీసీపీ రాజమహేంద్రనాయక్
స్టేషన్‌ఘన్‌పూర్: విద్యార్థులు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనకు ప్రతీ ఒక్కరు పాటుపడాలని డీసీపీ రాజమహేంద్రనాయక్ సూచించారు. ఘన్‌పూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పోలీసుశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువత, ఆటోడ్రైవర్లకు ‘యాంటీ డ్రగ్స్ అవేర్‌నెస్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. సీఐ జి.వేణు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన డీసీపీ మాట్లాడారు.. విద్యార్థులు, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ప్రతీ రోజూ యోగా, మెడిటేషన్ చేయడం ద్వారా మానసికంగా, శారీరకంగా బలంగా ఉంటారన్నారు. డ్రగ్స్‌కు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే 1908 టోల్‌ఫ్రీ నంబర్‌లో సమాచారం అందించాలన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, వ్యాసరచన, వాలీబాల్, షటిల్, చెస్, క్యారమ్‌బోర్డు తదితర పోటీల్లో విజేతలకు డీసీపీ చేతుల మీదుగా బహుమతులు అందించారు. కార్యక్రమంలో ఏసీపీ భీమ్‌శర్మ, సీఐ జి.వేణు, ఎస్‌ఐలు రాజేష్, మనీషా, హెచ్‌ఎం సంపత్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


