కలెక్టర్‌..పాఠాలు | - | Sakshi
Sakshi News home page

కలెక్టర్‌..పాఠాలు

Jun 21 2026 12:49 AM | Updated on Jun 21 2026 12:49 AM

స్థానిక కస్తూర్భా బాలికల విద్యాలయాన్ని శనివారం కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల పరిసరాలు, వంట గది, తరగతి గదులను పరిశీలించిన అనంతరం విద్యార్థినులకు ఇంగ్లిష్‌, గణితంపై గంటకు పైగా బోధన చేసి వారిలోని అభ్యాస స్థాయిని పరిశీలించారు. విద్యార్థినుల భవిష్యత్‌ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. ఖాన్‌ అకాడమీ తరగతులు, సాంకేతిక ఆధారిత విద్యా వనులను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. పదిహేను రోజులకు ఒకసారి మాక్‌ టెస్టులు నిర్వహించాలని, కార్పొరేట్‌ స్థాయికి దీటుగా బోధన చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అలాగే ఆహార నాణ్యతలో రాజీ పడితే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట విద్యాశాఖ అధికారులు, ఎస్‌ఓ సునిత, ఉపాధ్యాయులు ఉన్నారు. – నర్మెట (తరిగొప్పుల)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement