శనివారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 20 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 20 2026 10:38 AM | Updated on Jun 20 2026 10:38 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

సర్పంచ్‌, మహిళా సంఘాలు, వార్డు సభ్యులతో ఏర్పాటు

రైతులకు మేలు చేసేందుకు వ్యవసాయ శాఖ చర్యలు

309 కేంద్రాల్లో ఎరువులు, విత్తనాలు

ఫార్మర్‌ రిజిస్ట్రీలో రాష్ట్రంలో జనగామ 3వ స్థానం

జిల్లాలో సుమారు

1.80 లక్షల

మంది రైతులు

ఇప్పటివరకు

1.41 ÌS„ýSÌS ˘

మంది ఫార్మర్‌

రిజిస్ట్రీ పూర్తి

జనగామ: వానాకాలం ప్రారంభమవడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు తదితరాలపై వ్యవసాయ శాఖ నిఘా పెంచింది. ఇందులో భాగంగా బ్లాక్‌ మార్కెట్‌ను కట్టడి చేయాలనే ఉద్దేశంతో గ్రామస్థాయిలో సర్పంచ్‌ ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, వార్డుల సభ్యులతో కలిసి ‘నిగ్రానీ’ కమిటీలను ఏర్పాటు చేస్తోంది. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసే సమయంలో రైతులు.. తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, నకిలీ విత్తనాలు, అధిక ధరల అమ్మకాలు, బ్లాక్‌ మార్కెట్‌ వంటి సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. జిల్లాలో ప్రస్తుతం 309 పీఏసీఎస్‌లు, హాకా, ఏఆర్‌ఎస్‌కేఎస్‌, ఓడీసీఎం, ప్రైవేట్‌ ఫర్టిలైజర్‌ దుకాణాల్లో విత్తనాలు, ఎరువులు సమృద్ధిగా నిల్వ ఉంచి విక్రయాలు కొనసాగించనున్నారు. ఏఈఓ క్లస్టర్‌ స్థాయి వరకు ఏర్పాటు చేసిన సెంటర్లలో యూరియా అందుబాటులో ఉంటుంది. రైతుకు ఇబ్బందులు కలుగకుండా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఏఓ, ఏఈఓలు క్షేత్రస్థాయిలో నిఘా ఉంచారు.

ఫార్మర్‌ రిజిస్ట్రీ తప్పనిసరి

వ్యవసాయ శాఖ అమలు చేస్తున్న ఫార్మర్‌ రిజిస్ట్రీలో ప్రతీ రైతు తప్పనిసరి నమోదు చేసుకోవాలి. ఫార్మర్‌ ఐడీ ఉన్న రైతులు మాత్రమే యాప్‌ ద్వారా యూరియా బుకింగ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఏఈఓలు, కామన్‌ సర్వీస్‌ సెంటర్లలో ఉచితంగా, మీసేవా కేంద్రాల్లో రుసుం చెల్లించి రిజిస్ట్రీ చేసుకోవచ్చు. ప్రక్రియ పూర్తయిన 24 గంటల్లో ఫార్మర్‌ ఐడీ వస్తుంది.

ఒక్కసారి ఓపెన్‌ చేస్తే..

రెండోది 20 రోజుల తర్వాతనే..

యూరియా పంపిణీలో పారదర్శకత కోసం యాప్‌ ఆధారిత విధానాన్ని అమలు చేస్తున్నారు. రైతులు యాప్‌లో బుకింగ్‌ చేసుకున్న తర్వాత మొదటి విడతలో ఎకరానికి రెండు బస్తాల యూరియా పొందవచ్చు. రెండో విడత బుకింగ్‌ కోసం 20 రోజుల తర్వాత యాప్‌ తిరిగి ఓపెన్‌ అవుతుంది. వరి, పత్తి, మొక్కజొన్నతోపాటు ఇతర పంటలు సాగు చేసే రైతులు పంటల విస్తీర్ణానికి అనుగుణంగా యూ రి యా బుక్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. జిల్లాలో మరోమూడు రోజుల్లో యూరియా బుకింగ్‌ యాప్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. జిల్లాలో సుమారు 1.80 లక్షల మంది రైతులు ఉండగా, ఇప్పటివరకు 1.41 లక్షల మంది ఫార్మర్‌ రిజిస్ట్రీ చేసుకున్నారు. ఓటీపీ అందించకపోవడంతో కొంద రి నమోదు కాలేదు. ప్రస్తుతం ఫార్మర్‌ రిజిస్ట్రీ అమలులో రాష్ట్రంలో జనగామ మూడో స్థానంలో ఉంది.

ఎరువుల విక్రయాలపై ‘నిగ్రానీ’ కమిటీలతో నిఘా

ఎరువుల విక్రయాలపై పర్యవేక్షణ

వానాకాలం ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాల సరఫరాపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. హెచ్‌టీ కాటన్‌ విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. కానీ బ్లాక్‌ మార్కెట్‌లో విక్రయించే ప్రమాదం ఉంది. దీంతో గ్రామస్థాయిలో సర్పంచ్‌ల ఆధ్వర్యంలో మహిళా సంఘాలు, వార్డు సభ్యులు తదితరులతో కలిపి ‘నిగ్రానీ’ కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. విత్తనాలు, బ్లాక్‌ మార్కెట్‌, నిబంధనలకు విరుద్దంగా ఊర్లలో ఎరువుల విక్రయాలపై నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడడం ఈ కమిటీల బాధ్యత.

యూరియాపైనే ఆధార పడొద్దు

రైతులు కేవలం యూరియాపైనే ఆధారపడకుండా సమతుల్య ఎరువుల వినియోగాన్ని రైతులు అలవాటు చేసుకోవాలి. దుక్కిలో కాంప్లెక్స్‌ ఎరువులు ఉపయోగించి, నత్రజని, భాస్వరం, పొటాషియం సమతుల్యంగా ఉన్న ఎరువులతోపాటు అవసరమైన మేర యూరియా వాడితే సరిపోతుంది. భూమిలో తేమ ఉన్నప్పుడే సాగు పనులు చేపట్టాలి.

–అంబికా సోని, డీఏఓ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement