దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Jun 17 2026 4:57 AM | Updated on Jun 17 2026 4:57 AM

జనగామ రూరల్‌: జిల్లాలోని పెంబర్తి మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని కళా శాల ప్రిన్సిపల్‌ కె.భాగ్యలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ ఎంపీసీ, ఎమ్‌ఎస్సీఎస్‌, ఎమ్‌ఈసీఎస్‌, ఎమ్‌పీసీఎస్‌, బీజెడ్‌సీ,, బీకామ్‌ సీఏ, బీఏ (ఈపీహెచ్‌) కోర్సులు ఉన్నాయని తెలిపారు. ఇంటర్‌ పా స్‌ అయిన ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 17 నుంచి 19లోపు కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు హాస్టల్‌ వసతి, తదితర సౌకర్యాలు ఉంటాయన్నారు. వివరా లకు 70133 10928, 93472 13549 నంబర్లలో సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement