కొత్త వాల్యుయేషన్‌లో జిల్లాలోనే అత్యధికం
పట్టణంలోని సూర్యాపేట రోడ్డు
జనగామ: జిల్లాలో భూముల మార్కెట్ విలువలు భారీగా పెరిగాయి. పాలకుర్తిలో ఎకరం వ్యవసాయ భూమి అత్యధికంగా రూ.81.35లక్షలు, కొడకండ్లలో అత్యల్పంగా రూ.18.37లక్షలుగా నిర్ణయించారు. జనగామ పట్టణంలో గజం ధర రికార్డు స్థాయిలో రూ.43,300లకు పెరిగింది. కొత్త వాల్యుయేషన్ ధరలు ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులు, మండల కేంద్రాలు, వాణిజ్య ప్రాంతాల్లో అత్యధిక పెరుగుదల నమోదైంది. పట్టణ ప్రాంతాలతో పా టు గ్రామీణ ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూముల ధరలు గణనీయంగా పెరిగాయి.
పట్టణంలో..
జనగామ పట్టణంలో హనుమకొండ–బస్టాండ్ రోడ్డుతో పాటు చౌరస్తా, కలెక్టర్ రోడ్, సూర్యాపేట మెయిన్ రోడ్ ప్రాంతాల్లో(2–7, 2–9, 6–1, 6–2, 6–3 ఇంటి నంబర్ల పరిధిలో) గజం ధరలు భారీగా పెరిగాయి. గతంలో రూ.24,700లుగా ఉన్న విలువ కొన్ని ప్రాంతాల్లో రూ.43,300లకు చేరుకుంది. మరోవైపు రంగప్ప చెరువు, వడ్లకొండ రోడ్, వీవర్స్ కాలనీ, ఇందిరమ్మ నగర్, సంజయ్ నగర్, ధర్మకంచ తదితర ప్రాంతాల్లో గజం ధర రూ.3,200లతో పరిమిత స్థాయిలో పెంచారు.
మండలాల వారీగా
పాలకుర్తి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా నుంచి జనగామ, తొర్రూరు, తిరుమలగిరి, స్టేషన్ ఘన్‌పూర్ రూట్ల పరిధిలో వ్యవసాయ భూములకు జిల్లాలోనే అత్యధికంగా ఎకరానికి రూ.81.35 లక్షల మార్కెట్ విలువ నిర్ణయించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఏరియా, ప్రధాన రహదారుల వెంట గజం ధరను రూ.10,200 వరకు పెంచారు. దేవరుప్పుల మండలంలోని కామారెడ్డిగూడెం, సింగరాజుపల్లి, ధరావత్ తండా, సీతారాంపురం, మన్‌పహాడ్, గొల్లపల్లి గ్రామాల పరిధిలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భూముల విలువ ఎకరానికి రూ.80 లక్షలకు చేరింది. జఫర్‌గఢ్ మండల కేంద్రానికి ఆనుకుని ఉన్న నివాస ప్రాంతాల్లో ఎకరానికి రూ.70.13 లక్షల మార్కెట్ విలువ నిర్ణయించారు. బచ్చన్నపేట మండల కేంద్రంలోని కొడవటూరు కమాన్ సమీపంలో భూముల విలువ ఎకరానికి రూ.69.88 లక్షలకు పెరిగింది. రఘునాథపల్లి మండలంలో హైదరాబాద్–హనుమకొండ జాతీ య రహదారి వెంట భూముల ధరలు ఎకరానికి రూ.50 లక్షల వరకు పెరిగాయి. నర్మెట మండలంలో జనగామ–హుస్నాబాద్ ప్రధాన రహదారి వెంట ఉన్న భూములకు కూడా ఎకరానికి రూ.50 లక్షల వరకు వాల్యుయేషన్ నిర్ణయించారు. చిల్పూ రు మండలంలోని చిన్నపెండ్యాల, నష్కల్, వంగాలపల్లి ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి రూ.25.20 లక్షలకు చేరింది. కొడకండ్ల మండలంలో జనగామ–సూర్యాపేట హైవే వెంట ఎకరానికి రూ.18.37 లక్షల విలువ నిర్ణయిం చగా, సబ్‌రిజిస్ట్రార్ పరిధిలోని ప్రధాన రహదారుల వెంట గజం ధర రూ.4,200లకు పెరిగింది. లింగాలఘన్‌పూర్ మండలంలో జనగామ–సూర్యాపేట రోడ్డుకు ఆనుకుని ఉన్న భూములకు అత్యధికంగా రూ.8.21 లక్షలు, కనిష్టంగా రూ.2.81 లక్షల వాల్యుయేషన్ నిర్ణయించారు. స్టేషన్ ఘన్‌పూర్ మండలంలోని కొత్తపల్లి క్రాస్‌రోడ్, పల్లగుట్ట క్రాస్‌రోడ్, జాతీయ రహదారి పరిధిలో భూముల విలువ ఎకరానికి రూ.11.50 లక్షలకు పెరిగింది. బస్టాండ్ ప్రాంతంలో గజం ధర రూ.8,700లకు చేరగా, రంగారాయగూడెం, కోమటిగూడెం గ్రామాల్లో కనిష్టంగా రూ.1,300 విలువ నిర్ణయించారు. జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్, మరిగడి, అడవికేశ్వాపూర్, పెద్దరామన్‌చర్ల, ఓబుల్‌కేశ్వాపూర్, సిద్దెంకి గ్రామాల్లో రూ.2.50లక్షల వాల్యుయేషన్‌కు పెరగగా, జనగామ లోకల్, పెంబర్తి, శామీర్‌పేటలో రూ.65లక్షల వరకు పెరిగింది. కొత్త వాల్యుయేషన్ అమలుతో జిల్లాలో భూముల రిజిస్ట్రేషన్లు, స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలపై ప్రభావం పడనుండగా, ప్రభుత్వానికి ఆదాయం పెరగనుంది.
రూ.25.20 లక్షలు
రూ.69.88 లక్షలు
రూ.18.37
లక్షలు
రూ.70.13 లక్షలు
రూ.81.35 లక్షలు
రూ.50 లక్షలు
రూ.80 లక్షలు
రూ.65 లక్షలు
జనగామ
నర్మెట
కొడకండ్ల
చిల్పూరు
రఘునాథపల్లి
పాలకుర్తి
దేవరుప్పుల


