హైదరాబాద్‌ మారథాన్‌లో జిల్లా వాకర్లు | - | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ మారథాన్‌లో జిల్లా వాకర్లు

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

జనగామ: హైదరాబాద్‌ నెక్లెస్‌ రోడ్‌లో ఆదివారం జరిగిన మారథాన్‌న్‌ కార్యక్రమానికి జిల్లా వాకర్లు తరలివెళ్లారు. జిల్లా నుంచి అడ్వొకేట్‌ పానుగంటి శ్రీనివాస్‌ నేతృత్వంలోని బృందం రన్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌, క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా ఈ మారథాన్‌ నిర్వహించినట్లు తెలిపారు. యువతలో ఫిట్‌నెస్‌పై ఆసక్తి పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో కీర్తి వీరేందర్‌, మరాఠీ శ్రీశైలం, కుమారస్వామి, శ్రీనివాస్‌, ఉమేష్‌, మల్లికార్జునచారి, కసాబు రమేష్‌, బూరెల రామకృష్ణ, కానిస్టేబుళ్లు శాడ పోచయ్య, కోల భానుచందర్‌ ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement