ప్రతిష్టాత్మకంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్
జనగామ రూరల్:యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుందని ఉప ముఖ్యమంత్రి మంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్, పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలిసి అధికారులతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఆదేశించారు. సోమవారం మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి వీసీ ద్వారా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో ఫొటో ఓటరు జాబితా ప్రకటన, పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటన, మున్సిపల్ ఎన్నికల నిర్వహణ అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు చేసుకోవాలి..
ఫార్మర్ రిజిస్ట్రీలో ప్రతి రైతు నమోదు చేసుకోవాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. ౖపీఎం కిసాన్ తదుపరి వాయిదా డబ్బులు రైతుల ఖాతాలో జమ కావాలంటే ఈ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరని అన్నారు.
వీసీలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క


