గాలిపటమా పద..పద | - | Sakshi
Sakshi News home page

గాలిపటమా పద..పద

Jan 13 2026 6:07 AM | Updated on Jan 13 2026 6:07 AM

గాలిప

గాలిపటమా పద..పద

పతంగులకు తోడు రంగురంగుల దారాలు, చక్రాలు, పతంగి తోకలకు కొత్త డిజైన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉండటంతో పండుగ సందడి మరింతగా పెరిగింది. ప్రభుత్వమే పతంగుల పండుగను అధికారికంగా నిర్వహించటం ఈ సంప్రదాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది. కాగా, పతంగుల పోటీల ఉత్సాహంలో కొందరు నిషేధిత చైనా మాంజాను ఉపయోగించడం ఆందోళన కలిగిస్తోంది. ప్లాస్టిక్‌, పగిలిన గాజులతో తయారైన ఈ దారాలతో అక్కడక్కడా చిన్నపాటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రజలు జాగ్రత్తలు తీసుకుని సాంప్రదాయ దారాలనే వినియోగించాలని పోలీసులు సూచిస్తున్నారు.

జనగామ: సంక్రాంతి పండుగతో జిల్లాలో పతంగుల సందడి మొదలైంది. మార్కెట్లన్నీ రంగురంగుల పతంగులతో కళకళలాడుతున్నాయి. ఐదు రూపాయల నుంచి రూ.500 వరకు వివిధ రకాల డిజైన్లతో పతంగులను విక్రయిస్తున్నారు. దేశ జాతీయజెండా మూడు రంగులు కలిగిన కై ట్‌లు, స్పైడర్‌ మాన్‌, కార్టూన్‌ పాత్రలు, ప్రత్యేక ఆకృతుల్లో ఉన్న పతంగులు చిన్నారులను, యువతను బాగా ఆకర్షిస్తున్నాయి. పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో గ్రామాలు, పట్టణాల్లో పిల్లలు విశాలమైన మైదానాలకు చేరి పతంగుల పోటీలను నిర్వహిస్తున్నారు. ఆకాశాన్ని తాకేలా పతంగులను ఎగరేయడం పిల్లలకు అమితానందాన్ని ఇస్తోంది. పూర్వం ఇళ్లలో వండిన అన్నంతో అతికించి కాగితాలతో పతంగులు తయారు చేసుకునే ఆనవాయితీ ఉండేది. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా నేటితరం ప్లాస్టిక్‌ పేపర్‌తో తయారు చేసే పతంగుల వైపు ఆకర్షితమవుతున్నారు. ఇవి తేలికగా ఎగరటం, ఎక్కువసేపు గాల్లో నిలబడటం వంటి లక్షణాలతో డిమాండ్‌ పెరిగింది.

ఆకాశంలో పతంగుల హరివిల్లు

పతంగుల వెంట పరుగెత్తుతున్న పల్లెలు, పట్టణాలు రూ.5 నుంచి రూ.500 వరకు

జోరుగా అమ్మకాలు

రంగురంగుల దారాలు, చక్రాలు

గాలిపటమా పద..పద1
1/3

గాలిపటమా పద..పద

గాలిపటమా పద..పద2
2/3

గాలిపటమా పద..పద

గాలిపటమా పద..పద3
3/3

గాలిపటమా పద..పద

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement