సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
జనగామ: నేటి సమాజంలో యువత పాత్ర కీలకమని, క్రమశిక్షణ, దేశభక్తి కలిగి ఉండాలని వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ పిలుపునిచ్చారు. మండలంలోని యశ్వంతాపూర్ క్రీస్తుజ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవంలో సీఐ సత్యనారాయణరెడ్డితో కలిసి డీసీపీ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.. యువతలో నేషనల్ రోడ్ సేఫ్టీ, కష్టపడే మనస్తత్వం, శ్రమ, నైతికత మనసులో కలిగి ఉండాలన్నారు. యువత ఆవిష్కరణాత్మక ఆలోచన, నాయకత్వ లక్షణాలు, స్టార్టప్ సంస్కృతిపై అధ్యాపకుడు యాకుబ్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.
‘ఎంఎల్‌హెచ్‌పీ’ మెరిట్ జాబితా విడుదల
జనగామ రూరల్: కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో నేషనల్ హెల్త్ మిషన్ నందు ఖాళీగా ఉన్న ఎంఎల్‌హెచ్‌పీ (07) పోస్టులు కాంట్రాక్ట్ పోస్టుల మెరిట్ జాబితా విడుదల చేసినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె.మల్లికార్జునరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జాబితాలకు సంబంధించి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 17వ తేదీ సాయంత్రం 5:00 గంటల లోపు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో స్వయంగా తెలుపాలన్నారు. ఎంపికై నవారు తమ ఒరిజిన ల్ పత్రాలతో వ్యక్తిగతంగా 19వ తేదీన మధ్యాహ్నం 2.30 గంటలకు హాజరుకావాలన్నారు.
విద్యుత్ వినియోగదారులకు శుభాకాంక్షల లేఖలు
జనగామ: గృహజ్యోతి లబ్ధిదారులు, వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు ఉప ముఖ్యమంత్రి నూతన సంవత్సరం, సంక్రాంతి శుభాకాంక్షల లేఖలను విద్యుత్ శాఖ అధికారులు కుటుంబాల వద్దకు వెళ్లి వాటిని అందజేస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ సంపత్‌రెడ్డి మాట్లాడుతూ.. వినియోగదారుల పేరు, సర్వీస్ కనెక్షన్ నెంబర్‌తో వ్యక్తిగతంగా అడ్రస్ చేసిన ఈ లేఖలను తమ శాఖ అధికారులు స్వయంగా అందజేస్తున్నారు. ఆయన వెంట డీఈ లక్ష్మీనారాయణరెడ్డి, ఏఈ సౌమ్య తది తరులు ఉన్నారు.
రగ్బీ రాష్ట్రస్థాయి క్రీడల్లో జిల్లాజట్టు ప్రతిభ
పాలకుర్తి టౌన్: రాష్ట్రస్థాయి రగ్బీ క్రీడా చాంపియన్స్‌గా జిల్లా జట్టు నుంచి మండలంలోని చెన్నూరు రగ్బీ క్రీడాకారులు ప్రతిభను కనబరిచారు. ఈనెల 11న హైదరాబాద్ బోయిన్‌పల్లి స్కైకింగ్స్ ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి రగ్బీ చాంపియన్స్ క్రీడల్లో జనగామ జిల్లా జట్టు సత్తాచాటింది. 15 సంవత్సరాల లోపు బాలుర విభాగంలో నల్లగొండ జిల్లా జట్టుతో 20–10 స్కోరుతో గెలుపొందినట్లు రగ్బీ క్రీడా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు దొంతపమల్ల గణేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదిత్య తెలిపారు.
లింగంపల్లి జాతర వేలం ఆదాయం రూ.10.65 లక్షలు
చిల్పూరు: మండలంలోని లింగంపల్లి గ్రామంలో ఈనెల 29 నుంచి నిర్వహించే సమ్మక్క–సారలమ్మ జాతరలో భాగంగా సోమవారం దుకాణాలకు వేలం పాటలను దేవాదాయ శా ఖ భువనగిరి జిల్లా పరిశీలకుడు నిఖిల్, ఈఓ చిందం వంశీ ఆధ్వర్యంలో నిర్వహించారు. వేలం ద్వారా రూ.10,65,016 ఆదాయం వచ్చి నట్లు తెలిపారు. బంగారం బెల్లం మామిడాల బాలరాజు (లింగంపల్లి) రూ. 2.35 లక్షలు, పుట్టు వెంట్రుకలు లకావత్ శ్రీనివాస్ (కొండాపూర్) రూ. 2.21లక్షలు, కొబ్బరికాయలు రాజేందర్ (జాన్‌పాడ్)రూ. 2.63 లక్షలు, కొబ్బరికాయల చిట్టీలు రాజేందర్(మల్కాపూర్)రూ. 1.27 లక్షలు, కొబ్బరికాయ చిప్పలు భూక్య కిషోర్(జాన్‌పాడ్)రూ. 1.11లక్షలు, లడ్డూపులిహోర నగేష్ (పాలకుర్తి) రూ. 74వేలు, కోళ్లు భూక్య శ్రీనివాస్(గౌరెళ్లి) రూ. 2 లక్షలు, వైన్స్ మాటూరి కిరణ్ (లింగంపల్లి) రూ. 4.65 లక్షలతో దక్కించుకున్నారు. సర్పంచ్ భూక్య సునిత, కండ్లకోలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, కార్యదర్శి లింగం పాల్గొన్నారు.
సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకం


