లింగంపల్లి జాతర పనుల ప్రారంభం
చిల్పూరు: మినీ మేడారంగా పేరున్న మండలంలోని లింగంపల్లి గ్రామంలోని సమ్మక్క–సారలమ్మ జాతరకోసం శుక్రవారం అభివృద్ధి పనులను సర్పంచ్ భూక్య సునితలాలు ప్రారంభించారు. సాక్షి దినపత్రికలో ‘మినీ జాతరలు.. మొదలుకాని ఏర్పాట్లు’ అనే కథనం ప్రచురితం కాగా..జాతర ఈఓ చిందం వంశీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులతో పాటు, టెండర్ల ప్రచార రథాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉమ్మగోని రాజు, కండ్లకోలు శ్రీనివాస్, చంద్రమౌళి, ఏదునూరి రవీందర్, కండ్లకోలు బాలరాజు, తుత్తురు రాజు, ఊరడి రాజు, సందోజు రవీంద్రచారి, అపరాదపు రాజు, మంద సిద్ధు, రజాక్, స్వప్న, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
12న దుకాణాల ఏర్పాటుకు వేలం పాటలు
ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు మండలంలోని లింగంపల్లి గ్రామంలోని సమ్మక్క–సారలమ్మ జాతర సందర్భంగా 12వ తేదీన జాతరలో దుకాణాల ఏర్పాటుకు వేలం పాటలు నిర్వహిస్తున్నట్లు ఈఓ చిందం వంశీ తెలిపారు. శుక్రవారం జాతర ప్రాంగణంలో కరపత్రాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. బంగారం(బెల్లం), మొక్కుబడి వెంట్రుకలు, కొబ్బరి కాయలు, కోళ్లు, పెదతీర్థం, కొబ్బరికాయ చిట్టీలు, కొబ్బరి చిప్పలు, తదితర వాటికి వేలం పాటలు ఉన్నందున ఆసక్తిగల వారు 83309 49032, 99483 69761 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు.
లింగంపల్లి జాతర పనుల ప్రారంభం


