రాష్ట్రస్థాయి ఎడ్యూటాక్ పోటీలకు 8 మంది ఎంపిక
లింగాలఘణపురం: జిల్లాలోని నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఎల్టా ఆధ్వర్యంలో జరిగిన ఒలంపియాడ్, ఎడ్యూటాక్ పోటీలకు జిల్లా నుంచి 8 మంది విద్యార్థులు ఎంపికై నట్లు ఎల్టా (ఇంగ్లిష్ లాగ్వేజ్ టీచర్స్ అసొసియేషన్) జిల్లా అధ్యక్షుడు రావుల వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం నెల్లుట్ల ఉన్నత పాఠశాలలో ఎల్టా ఆధ్వర్యంలో ఒలంపియాడ్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో కాంపిటీషన్), ఎడ్యూటాక్ (ఏదైన టాపిక్‌పై విద్యార్థుల ప్రసంగం) జిల్లా స్థాయి పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్టా జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఈ నెల 24న రాష్ట్రస్థాయిలో జరిగే పోటీల్లో జనగామ జిల్లా నుంచి ఎంపికై న సీనియర్, జూనియర్ విద్యార్థులు డి.రిత్విక్ (మాదాపూర్), కె.వైష్ణవి (చీటూరు), ఎస్.సంకీర్తణ (ఖిలాషాపూర్), జి.అర్షిత (పల్లగుట్ట), సాత్విక్‌వర్ధన్, ఉజ్వల (లింగాలఘణపురం), అశ్విత (చిల్పూరు), హర్షిణి (స్టేషన్‌ఘన్‌పూర్) ఎంపికై నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో ఎల్టా రాష్ట్ర , కోశాధికారి శ్రీనివాసురెడ్డి, జిల్లా కార్యదర్శి ఆనంద్, రాష్ట్ర సభ్యుడు శ్రీనివాసు, స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బి.రవీందర్ తదితరులు పాల్గొన్నారు.


