భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు
మినీ మేడారం జాతరగా పేరున్న లింగంపల్లి జాతరకు గతేడాది మూడు లక్షల పైచిలుకు భక్తులు వచ్చారు. ఈసారి మరింత పెరిగే అవకాశం ఉన్నందున సంబంధిత అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నాం. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
– చిందం వంశీ, ఈఓ,
లింగంపల్లి సమ్మక్క సారలమ్మ జాతర
ఇప్పగూడెం చింతగట్టు శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు సుమారు మూడు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. గత జాతర సౌకర్యాలు మోస్తరుగా ఉన్నా చివరి రెండు రోజులు భక్తులు ఇబ్బందులు పడ్డారు. గతానుభవాల దృష్ట్యా అధికారులు ఈసారి జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. మంచినీరు, మరుగుదొడ్లు, రవాణా సౌకర్యాలు వంటి మౌలిక వసతులు కల్పించాలి.
– ఆరూరి జయప్రకాశ్, ఇప్పగూడెం
మినీ మేడారంగా పిలువబడుతున్న లింగంపల్లి జాతరకు వచ్చే భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతోంది. దూరప్రాంతాల నుంచి వచ్చేవారికి తాగునీరు, ఉండడానికి వసతులు ఏర్పాటు చేయాలి. మేడారంలో మాదిరి గద్దెల వద్ద శాశ్వత పనులు చేపట్టాలి. రోడ్డు ఇబ్బందులు కలుగకుండా గుంతలు లేకుండా చూడాలి.
– సందోజు రవీంద్రచారి, లింగంపల్లి
●
భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు
భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు


