పోలింగ్ కేంద్రాల ప్రకటన తేదీలో మార్పు
జనగామ: మున్సిపాలిటీ ఎలక్షన్ల సందర్భంగా పోలింగ్ స్టేషన్ల ప్రచురణ షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ బుధవారం తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణికుముదిని ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ స్టేషన్ల ప్రచురణకు కొత్త తేదీలను నిర్ణయించారు. ఈ నెల 12వ తేదీన వా ర్డుల వారీగా ఫొటో ఓటర్ల జాబితా (ఫైనల్ పబ్లికేషన్) ప్రచురణ చేయనున్నారు. 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల ముసాయిదా జాబితా (డ్రాఫ్ట్) విడుదల, అలాగే టీపోల్ సిస్టంలో అప్‌లోడ్ చేయడానికి నిర్ణ యం తీసుకున్నారు. 16వ తేదీన తుది పోలింగ్ కేంద్రాల జాబితా, పోలింగ్ స్టేషన్ వారీగా ఫొటో ఓట ర్ల జాబితాను ప్రచురణ చేయనున్నారు. వీటిని కలెక్టర్, డీఈఏఎస్, మున్సిపల్ కమిషనర్, ఆర్డీఓ, తహ సీల్దార్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. ఓటరు జాబితా తేదీల గడువు పెంచడంతో ఈ నెల10వ తేదీ వరకు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ మునిసిపల్ పరిధిలో ముసాయిదా జాబితాపై అ భ్యంతరాలను స్వీకరించనున్నారు. వార్డుల వారీగా ఓటర్ల మిస్సింగ్, అదనంగా కలువడం, ఓట్ల షిఫ్టింగ్ తదితర వాటిపై రెండు పురపాలికల పరిధిలో ఇప్పటి వరకు భారీగానే దరఖాస్తులు వచ్చాయి.
12వ తేదీన మున్సిపల్ వార్డుల వారీగా ఫొటో ఓటరు జాబితా
16న పోలింగ్ కేంద్రాల జాబితా విడుదల


