ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన చేపట్టాలి
స్టేషన్‌ఘన్‌పూర్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు త్వరితగతిన చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ ఎండీ వీపీ గౌతమ్ సూచించారు. స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఛాగల్లులో చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ఆయన బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడారు.. సంబంధిత బిల్లుల కోసం ఎవ్వరూ ఎవరికీ ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, నిబంధనల మేరకు లబ్ధిదారులకు బిల్లులు వస్తాయన్నారు. ఏమైనా ఇబ్బందులుంటే తమ దృష్టికి తీసుకురావాలని, త్వరలో లబ్ధిదారులకు పెండింగ్ బిల్లులు వస్తాయన్నారు. ఆయన వెంట హౌసింగ్ పీడీ మాతృనాయక్, డీఈ చంద్రశేఖర్, ఏఈ అఖిల, మున్సిపల్ కమిషనర్ బి.రాధాకృష్ణ, మున్సిపల్ అధికారులు సత్యనారాయణ, సందీప్, లింగయ్య, శ్రీనివాస్, నాయకులు పోగుల సారంగపాణి ఉన్నారు.
హౌసింగ్ ఎండీ వీపీ గౌతమ్


