బతికుండగానే రికార్డుల్లో చంపేశారు
స్టేషన్‌ఘన్‌పూర్: మండలంలోని ఇప్పగూడెం గ్రామానికి చెందిన అన్నెపు వెంకటయ్య అనే వృద్ధుడికి ఽఅధికారుల నిర్లక్ష్యంతో 8 నెలలుగా పింఛన్ నిలిచిపోయింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వెంకటయ్యకు 2022 నుంచి 2025 వరకు మూడేళ్ల పాటు వృద్ధాప్య పింఛన్ వచ్చింది. అయితే అధికారుల తప్పిదంతో గత 8నెలలుగా అతడికి పింఛన్ రావడం లేదు. ఈ విషయమై బాధిత వృద్ధుడు గ్రామ పంచాయతీ, ఎంపీడీఓ కార్యాలయంతో పాటు పలుమార్లు కలెక్టరేట్‌కు వెళ్లినా ఫలితం లేదు. దాంతో బాధితుడు మంగళవారం తనగోడు మీడియాతో వెళ్లబోసుకున్నాడు. అధికారుల నిర్లక్ష్యంతో పింఛన్ రావడం లేదన్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదిస్తే రికార్డులో తాను చనిపోయినట్లు ఉందని చెపుతున్నారని వాపోయాడు. తాము ఏమి చేయలేమని, హైదరాబాద్‌కు వెళ్లాలని చెపుతున్నారని తెలిపారు. ఈ విషయమై ఇన్‌చార్జ ఎంపీడీఓ నర్సింగరావును వివరణ కోరగా విచారణ చేపట్టి బాధితుడికి న్యాయం చేస్తామని తెలిపారు.
ఎనిమిది నెలలుగా బాధితుడికి
అందని వృద్ధాప్య పింఛన్


