ఓటర్ల జాబితాలో సవరణకు దరఖాస్తు చేసుకోండి
● స్టేషన్ ఘన్‌పూర్ మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ
స్టేషన్‌ఘన్‌పూర్: ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, సవరణలకు ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ బి.రాధాకృష్ణ సూచించారు. మున్సిపాలిటీ ఓటర్ల ముసాయిదా జాబితాపై ఈనెల 5వరకు మున్సిపల్ కార్యాలయంలో అభ్యంతరాలు స్వీకరించామని, 15 అభ్యంతరాలు రాగా ఒకే ఇంటి నంబర్ ఉండి ఇతర వార్డుల్లో పడిన ఓట్ల విషయమై తమ పరిధిలోని ఐదింటిని పరిష్కరించామని, మిగిలిన అభ్యంతరాలను ఆర్‌డీఓ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అదేవిధంగా ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి ఓట్లు తొలగింపు, పేర్లు, తండ్రి పేర్ల తప్పులు తదితర అంశాలపై ఆర్‌డీఓ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. రెండు రోజుల్లో దరఖాస్తులు చేసుకోవాలని, ఈనెల 10న తుది ఓటర్ల జాబితా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్లు నితిన్‌కుమార్, సందీప్, చుక్క లింగయ్య తదితరులు పాల్గొన్నారు.
ఓటర్ల జాబితాలో సవరణకు దరఖాస్తు చేసుకోండి


