పరిధిదాటి పనిచేస్తున్నారు
డీఈఓ కార్యాలయంలో పూర్తిస్థాయి డీఈఓ లేకపోవడంతో కొందరు పరిధి దాటి పనిచేస్తున్నారు. దీంతో ఇటువంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎవరి పరిధిలో వారు పని చేస్తేనే విద్యాశాఖ గౌరవ ప్రతిష్టలు దెబ్బతినకుండా ఉ ంటాయి. ఉపాధ్యాయుల సర్ధుబాటులో చిన్న చిన్న పొరపాట్లు జరిగాయి. అవి మా దృష్టికి కూడా వచ్చాయి. మేము కూడా డీఈఓతో మాట్లాడినం.
– కొల్ల మహిపాల్‌రెడ్డి,
జిల్లా అధ్యక్షుడు, పీఆర్‌టీయూ
సమన్వయలోపాన్ని ఎత్తి చూపిస్తోంది
జిల్లా విద్యాశాఖలో ఇటీవల జరుగుతున్న సంఘటనలు అధికారుల సమన్వయ లోపాన్ని తెలియజేస్తున్నాయి. ఏ కార్యక్రమాన్ని చేపట్టినా సంఘ బాధ్యులు, ఇతర అధికారులతో సమన్వయపరుచుకొని నిబంధనల ప్రకారం నడుచుకో వలసిన అవసరం ఉంది. విద్యాశాఖకు సంబంధించిన పూర్తిస్థాయి జిల్లా విద్యాశాఖ అధికారిని నియమించాలి. తద్వారా సమస్యలు పరిష్కారమవుతాయి.
– సలాది సత్తయ్య, జిల్లా అధ్యక్షుడు,
ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం
సాక్షి కథనాలపై పూర్తి విచారణ చేపట్టాలి
జిల్లా విద్యాశాఖ పగ్గాలు ఐఏఎస్ చేతికి వెళ్లడంతో చాలా మార్పులు జరుగుతాయని భావించాం. దానికి భిన్నంగా అనేక బాధ్యతలు ఉండడం వల్ల పూర్తిస్థాయిలో దృష్టిపెట్టకపోవడాన్ని ఆసరా చేసుకుని కొద్దిమంది మేం ఏది చెబితే అదే నడుస్తుంది అన్నట్టుగా వ్యవరించడం సరికాదు. మొన్న జరిగిన సావిత్రిబాయి ఫూలే వేడుకలు ఎవరికి సమాచారం లేకుండా, కొద్దీ మంది సమక్షంలో, ఎంపిక ప్రక్రియ కూడా తెలుపకుండా చేశారంటే చేశారన్నట్టుగా చేశారు. డీఈఓ కార్యాలయంపై సాక్షిలో వరుసగా వస్తున్న కథనాలపై దృష్టి పెట్టి సరిచేయాల్సిన అవసరం ఉంది. – పి.చంద్రశేఖర్‌రావు, జిల్లా అధ్యక్షుడు, టీఎస్‌యూటీఎఫ్
పరిధిదాటి పనిచేస్తున్నారు
పరిధిదాటి పనిచేస్తున్నారు


