రోడ్డు భద్రతపై అవగాహన ఉండాలి
● సీనియర్ సివిల్ జడ్జి సుచరిత
జనగామ రూరల్: రోడ్డు భద్రతపై ప్రతీ ఒక్కరికి అవగాహన ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి ఇ.సుచరిత అన్నారు. మంగళవారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అదేశాల ప్రకారం ఆన్ రోడ్ సురక్ష అభియాన్ స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఈసందర్భంగా కోర్టు నుంచి చౌరస్తా వరకు విద్యార్థులు, పోలీసులు, న్యాయవాదులు, పారాలీగల్ వలంటరీలు, వాహనదారులు ర్యాలీ చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ రూపొందించిన ప్రమాణ పత్రాన్ని చదివి వారితో ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో జూనియర్ సివిల్ జడ్జి జి.శశి, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కె.సందీప, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, ఎస్సై చెన్నకేశవులు, ఎంఈఓ శంకర్‌రెడ్డి , లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ చీఫ్ ఎం.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.


