నేడు కేటీఆర్ రాక
జనగామ: పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన బీఆర్‌ఎస్ బలపరిచిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులను సత్కరించేందుకు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 6న (మంగళవారం) జిల్లా కేంద్రానికి రానున్నారు. సూర్యాపేట రోడ్డు భ్రమరాంబ కన్వెన్షన్ హాల్లో జరుపతలపెట్టిన సర్పంచ్‌ల అభినందన సభలో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు పెంబర్తి కాకతీయ కళాతోరణం వద్ద కేటీఆర్‌కు స్వాగతం పలికి, అక్కడ నుంచి భారీ ర్యాలీగా జనగామ ఆర్టీసీ చౌరస్తాకు చేరుకుంటారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి, నెహ్రూపార్కు మీదుగా భ్రమరాంబ కన్వెన్షన్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి మూడు నియోజకవర్గాల నుంచి తరలివచ్చే సర్పంచ్‌లను కేటీఆర్‌ను సత్కరిస్తారు. ఈనేపథ్యంలో అభినందన సభ ఏర్పాట్లను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పరిశీలించారు. అభినందన సభకు గులాబీ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
నూతన సర్పంచ్‌లకు అభినందన సభ
ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పల్లా, మాజీమంత్రి ఎర్రబెల్లి


