ఎమ్మెల్యే పల్లాకు ఓసీ జేఏసీ ఆహ్వానం
జనగామ: ఈ నెల 11న వరంగల్ నగరంలో నిర్వహించనున్న ఓసీ జేఏసీ మహా గర్జన కార్యక్రమానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఆహ్వానిస్తూ అధికారికంగా ఆహ్వాన పత్రికను సోమవారం అందించారు. ఈ సందర్భంగా ఓసీ వర్గాల హక్కులు, సమస్యలు, ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే లక్ష్యంతో నిర్వహించనున్న ఈ మహా గర్జన కార్యక్రమానికి పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరు కావడం మరింత బలం చేకూరుస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపు జైపాల్‌రెడ్డి, కార్యదర్శి దుబ్బ శ్రీనివాస్, కోశాధికారి నడిపెల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిశెట్టి ప్రమోద్ కుమార్, రాష్ట్ర సలహాదారుడు, రావుల నరసింహరెడ్డి, రెడ్డి సంఘం జిల్లా అధ్యక్షులు, మార్వాడీ సంఘం నాయకులు కృష్ణ, జీవన్ బజాజ్ తదితరులు పాల్గొన్నారు.


