తీరని వ్యథలు
జనగామ రూరల్: ఏళ్ల తరబడి తిరుగుతున్నా తమ వ్యథలు తీరడం లేదని, దూరప్రాంతాల నుంచి వచ్చి దరఖాస్తులు ఇవ్వడమే తప్పా సమస్యలు పరిష్కారం కావడం లేదని ప్రజలు వాపోతున్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌లో పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు పింకేశ్ కుమార్, బెన్ షాలోమ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 69 దరఖాస్తులను స్వీకరించారు.
ఏళ్ల తరబడి తిరుగుతున్నా సమస్యల పరిష్కారమేది?
గ్రీవెన్స్‌లో ప్రజల ఆవేదన
69 అర్జీల స్వీకరించిన అధికారులు


