జాబితా సవరించాల్సిందే..
● అఖిలపక్ష పార్టీల సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకుల డిమాండ్
స్టేషన్‌ఘన్‌పూర్: నూతనంగా ఏర్పడిన స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీకి సంబంఽధించి ముసాయిదా ఓటర్ల జాబితాలో సవరణలు చేయాలని బీఆర్‌ఎస్ నాయకులు కనకం గణేశ్, తాటికొండ సురేశ్ డిమాండ్ చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ రాధాకృష్ణ హాజరుకాగా ముందుగా వివిధ పార్టీల నాయకులు మాట్లాడారు. బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. వార్డులను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారని, 1వ వార్డు ఘన్‌పూర్‌లో, 2,3,4,5 శివునిపల్లిలో, 6,7,8,9 ఛాగల్లులో, తిరిగి 10 నుంచి 18 వరకు వార్డులు ఘన్‌పూర్‌లో ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేశారన్నారు. ఘన్‌పూర్ ఎస్సీ కాలనీకి చెందిన 12, 13వ వార్డులకు అటుఇటుగా చేశారని ఆరోపించారు. ఎస్సీ కాలనీలో మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య ఓటు ఉన్న వార్డులోనే ఓట్లను ఇతర వార్డులలో వేశారని, అధికారులు నిర్లక్ష్యంగా పనిచేశారని ఆరోపించారు. అదేవిధంగా గతంలో శివునిపల్లిలోని ఎస్సీ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల పేర్లను జనాభా లెక్కల్లో అధికారులు తప్పుగా రాయడంతో గతంలో శివునిపల్లి సర్పంచ్ ఎస్టీ రిజర్వేషన్ వచ్చిందని, అలాంటి తప్పిదాలు ఈసారి జరుగకుండా చూడాలని కోరారు. ఇందుకు కమిషనర్ స్పందిస్తూ 2011 జనాభా లెక్కల ప్రాతిపదికన టౌన్ ప్లానింగ్, మాస్టర్‌ప్లాన్, ఇంటి నంబర్ల ప్రాతిపదికన ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు వార్డులు, ఓటర్లు విభజన చేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ఎ.సత్యనారాయణ, సీనియర్ అసిస్టెంట్లు నితిన్, సందీప్, లింగయ్య, రాజకీయ పార్టీల నాయకులు జూలుకుంట్ల శిరీష్‌రెడ్డి, మాచర్ల గణేష్, అంబటి కిషన్‌రాజ్, తెల్లాకుల రామకృష్ణ, పెసరు సారయ్య, పృథ్వీ, గుండె మల్లేష్, కుంభం కుమార్, అమ్జద్‌పాషా, తోట రమేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.


