నీట్ పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా వసతులు
జనగామ: జిల్లా కేంద్రంలో నిర్వహించబోయే నీట్ పరీక్ష కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్‌న్స్ హాల్లో నీట్ పరీక్షలు–2026 నిర్వహణపై డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి కలెక్టర్ పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది మేలో నీట్ కోసం జిల్లాలో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు మహాత్మా గాంధీ జ్యోతిరావు ఫూలే రెసిడెన్షియల్ స్కూల్‌లో రెండు సెంటర్లు కేటాయించామన్నారు. 650 మంది అభ్యర్థులు హాజరు కానున్నట్లు చెప్పా రు. పరీక్షలు రాసే విద్యార్థులకు ఎలాంటి సమస్యలు, ఆటంకాలు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు సత్యమూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
విద్యార్థులకు ఆరోగ్య పరిరక్షణలో దిక్సూచి కార్యక్రమం ముఖ్యభూమిక పోషిస్తోందని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. కలెక్టరేట్ సమావేశం హాల్‌లో విద్యార్థుల ఆరోగ్య సమగ్రాభివృద్ధి కోసం అమలు చేస్తున్న దిక్సూచి కార్యక్రమ అమలుపై కలెక్టర్ సమీక్ష చేశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 12వ తేదీలోపు విద్యార్థులందరికీ హెల్త్ కార్డులను తప్పనిసరిగా జారీ చేయాలని ఆదేశించారు. విద్యాసంస్థల్లో ప్రతిరోజు ఉదయం, సాయంత్రం 15 నిమిషాల పాటు అనీమియా పీరియడ్ నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ పింకేశ్ కుమార్, డీఎంహెచ్‌ఓ మల్లికార్జున్‌రావు, ఇతర ఆరోగ్య, సంక్షేమ అధికారులు, వైద్యులు, రెసిడెన్షియల్ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, వార్డెన్లు పాల్గొన్నారు.
సమీక్షలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్


