మోడల్ మార్కెట్ పనులు త్వరగా పూర్తి చేయాలి
జనగామ రూరల్: పట్టణంలోని మున్సిపాలిటీ పరిధిలో నిర్మాణం చేస్తున్న మోడల్ మార్కెట్ చివరి దశ పనులను త్వరగా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ అన్నారు. శనివారం నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ భవన నిర్మాణ నాణ్యత, అంతర్గత వసతులు, షాపుల ఏర్పాటు, పారిశుద్ధ్య సదుపాయాలు, తాగునీటి వసతి, డ్రెయినేజీ వ్యవస్థ, విద్యుత్ సదుపాయాలు, వ్యర్థాల నిర్వహణ. ప్రజలకు సౌకర్యవంతంగా వినియోగించేలా చేపట్టాలన్నారు. మోడ ల్ వెజ్ నాన్‌వెజ్ మార్కెట్ పట్టణ ప్రజలకు అవసరమైన శుభ్రత, పారిశుద్ధ్యం నాణ్యతపై ఎలాంటి రాజీ లేకుండా తుది పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ పింకేష్‌కుమార్


