అధైర్యపడకండి.. అండగా ఉంటా
చిల్పూరు: ‘అధైర్య పడకండి..అండగా నేనుంటా..’అని జర్మనీలోని అపార్ట్‌మెంట్‌లో జరిగిన ఓ ప్రమాదంలో ఇటీవల మృతిచెందిన హృతిక్‌రెడ్డి తల్లిదండ్రులను మండలంలోని మల్కాపూర్ గ్రామంలో ఎంపీ కడియం కావ్య శుక్రవారం పరామర్శించారు. మృతుడి తల్లిదండ్రులు తోకల సంపత్‌రెడ్డి– కరుణలను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రస్తుతం ఎంబసీకి సెలవులు ఉండడంతో మృతదేహం తీసుకరావడానికి కొంత సమయం పడుతుందని, సెలవులు ముగియగానే తీసుకొచ్చే విధంగా తాను కృషిచేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఎడవెళ్లి లావణ్యమల్లారెడ్డి, ఉపసర్పంచ్ పశుల వెంకటేష్, నాయకులు యశ్వంతరెడ్డి, జంగం రవి, పుల్యాల నారాయణరెడ్డి, నాగిడి సంపత్‌రెడ్డి, బండారి ప్రభాకర్, బోగి రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
హృతిక్‌రెడ్డి తల్లిదండ్రులకు
ఎంపీ కావ్య ఓదార్పు


