
విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాం..
జనగామ: జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉందని ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్ తెలిపారు. బుధవారం సర్కిల్ కార్యాలయంలో జరిగిన రివ్యూలో ఎస్‌ఈ మాట్లాడారు. విద్యుత్ వినియోగదారులు, రైతులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్ష ప్రభావంతో మండలాల వారీగా మానిటరింగ్ చేస్తున్నామని, సిబ్బంది, మెటీరియల్‌ను సిద్ధం చేసి ఉంచామన్నారు. అత్యవసర సమయంలో విద్యుత్ పునరుద్ధరణకు మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ వాహనాలను సైతం అందుబాటులో ఉంచినట్లు స్పష్టం చేశారు. షిఫ్ట్ పద్ధతిలో ఉద్యోగులు 24 గంటల పాటు విధుల్లో ఉంటారన్నారు. గాలివాన బీభత్సంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే పునరుద్ధణ చేసేందుకు టీంలు సంఘటన స్థలికి చేరుకోవడంతో జాప్యాన్ని నివారించే చర్యలు తీసుకున్నామన్నారు. ఇందుకు సంబంధించి కంట్రోల్ రూం ఏర్పాటుతో పాటు టోల్ ఫ్రీ 1912 నంబర్ సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులు, వినియోగదారులు సొంతంగా కరెంటు రిపేరు పనులు చేయొద్దని, కిందకు జారి వేళ్లాడుతున్న విద్యుత్ తీగలు, వదులుగా ఉన్న వాటిని తాకవద్దన్నారు. రైతులు తమ వ్యవసాయ అవసరాల నిమిత్తం నాణ్యతలేని వ్యవసాయ పంపు సెట్లను వినియోగించే సమయంలో కరెంటు మోటార్లు, ఫుట్ వాల్వులు, సర్వీసు వైర్లకు ఇన్సులేషన్‌కు విద్యుత్ ప్రసారం జరిగి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. వ్యవసాయ పంపు సెట్లు, స్టార్టర్లకు విధిగా ఎర్త్ ఉండేలా చూసుకోవాలని ఎస్‌ఈ వేణుమాధవ్ తెలిపారు.
మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్ల
వాహనాలు సిద్ధం
ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ వేణుమాధవ్
జిల్లాకు చేరిన ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం
భారీ వర్ష సూచన హెచ్చరికల నేపఽథ్యంలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు బుధవారం రాత్రి జనగామ జిల్లాకు చేరుకున్నాయి. జిల్లాలో అత్యవసర సేవలు, కల్వర్టుల వద్ద ప్రమాదాలు, చెరువు కట్టలపై ముప్పు తదితర అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను కాపాడేందుకు ఈ బృందంలోని ప్రతినిధుల లక్ష్యం.

విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటాం..