
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
చిల్పూరు: పల్లగుట్ట గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు హెచ్‌ఎం వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ఇటీవల శ్రీవాణి పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి షూటింగ్ బాల్ బాలబాలికల సబ్ జూ నియర్ విభాగంలో జరిగిన సెలక్షన్‌లో అభిజ్ఞ, ప్రీతి, యామిని, సాయిప్రియ, సుశాంత్, కార్తీక్, అక్షయ్, విష్ణులు రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు నారాయణపేట జిల్లా మక్తల్‌లో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల ఆవరణలో పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ దేవ్‌సింగ్, చిల్పూరు ఆలయ చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్‌రావు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ చిర్ర నాగరాజు, ఉపాధ్యాయులు అభినందించారు.