జనగామ రూరల్: రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించి అడ్తిదారులు, ఖరీదుదారులు కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా చందునాయక్ అన్నారు. వ్యవసాయ మార్కెట్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి నరేంద్రకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మార్కెట్‌లో పూర్తిస్థాయి డిజిటల్ ఈ–నామ్ అమలు కావడం లేదని, బిడ్డింగ్‌లో ధరలు వేయకుండా ఆఫ్‌లైన్ పద్ధతిలో తక్కువ ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి వారం రోజుల నుంచి కొనసాగుతున్నదని చెప్పారు. ఈ–నామ్‌లో సమయానికి అనుగుణంగా ఖరీదారులు వచ్చేలా చర్యలు చేపట్టడంతోపాటు కనీస మద్దతు ధర రూ.1,850తో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే మార్కెట్లో మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతులకు ఉచితంగా భోజన వసతి కల్పించాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉపేందర్, మంగ బీరయ్య, బోడ రాములు, ఉర్సుల కుమార్, తాండ్ర ఆనందం తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి చందునాయక్


