ప్యాక్స్‌ కార్యవర్గం ప్రమాణం | - | Sakshi
Sakshi News home page

ప్యాక్స్‌ కార్యవర్గం ప్రమాణం

Aug 30 2026 11:38 PM | Updated on Aug 30 2026 11:38 PM

● బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు

మల్యాల: మండలంలోని పోతారం పీఏసీఎస్‌ కార్యవర్గం ఆదివారం ప్రమాణస్వీకారం చేసింది. చైర్మన్‌గా కొల్లూరి గంగాధర్‌, డైరెక్టర్లుగా పరిపెల్లి విజయ, ముత్యాల రమేశ్‌, గజ్జెల లక్ష్మీ, బోగ శంకర్‌, దండే మనోహర్‌, శెట్టి లక్ష్మారెడ్డి, నల్ల వసంత్‌, క్యాతం మనోహర్‌ రెడ్డి, బద్దం భూమక్క, బొజ్జ తిరుపతి, గుర్రం చంద్రయ్య నియామకం అయ్యారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హాజరయ్యారు. కొత్త కార్యవర్గాన్ని సన్మానించారు. సర్పంచులు కొండపల్కల గోదాదేవి, చెవులమద్ది శ్రీనివాస్‌, గుర్రం విజయ్‌, గ్యాదం కుమార్‌, దారం ఆదిరెడ్డి, బద్దం తిరుపతిరెడ్డి, మరాటి సత్తయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బత్తిని శ్రీనివాస్‌ గౌడ్‌, వెల్మ లక్ష్మారెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు ముత్యం శంకర్‌, మండలాధ్యక్షుడు శనిగరపు తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క అనిల్‌ పాల్గొన్నారు.

కాంగ్రెస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

మెట్‌పల్లి: కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అన్నారు. పట్టణంలోని బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆదివారం పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్‌ 2 నుంచి 8తేదీ వరకు పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే నిరసన కార్యక్రమాలపై వారితో చర్చించి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతోందని, ఆ పార్టీ పాలనలో అన్నివర్గాలు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ వైఫల్యాలను బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించాలన్నారు. సమావేశంలో మారు సాయిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, తోట శ్రీనివాస్‌ తదితరులున్నారు.

బల్దియా చైర్మన్‌ లింబాద్రిని కలిసిన సినీ గేయ రచయిత

మెట్‌పల్లి: సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ ఆదివారం మున్సిపల్‌ చైర్మన్‌ మైలారపు లింబాద్రిని ఆయన నివాసంలో కలిశారు. అశోక్‌తేజ రచించిన ‘నేను అడవిని మాట్లాడుతున్నాను’ అనే పుస్తకాన్ని ఆయనకు అందజేశారు. కార్యక్రమంలో లింబగిరి స్వామి తదితరులున్నారు.

పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నం

జగిత్యాలరూరల్‌/జగిత్యాలజోన్‌/రాయికల్‌: పేదల సొంతింటి కలను నెరవేర్చుతున్నామని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ అన్నారు. జగిత్యాలరూరల్‌ మండలం తిమ్మాపూర్‌కు చెందిన గాదె అన్నపూర్ణ, సంతోష్‌ నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంట్లో గృహప్రవేశం చేశారు. సర్పంచ్‌ మోహన్‌ రెడ్డి, ఉప సర్పంచ్‌ అనిత, నాయకులు సాగర్‌, మహిపాల్‌ రెడ్డి, సురేష్‌, రాజేష్‌, శంకరయ్య పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో వినాయక నవరాత్రోత్సవాల కరపత్రిక ను ఆవిష్కరించారు. పద్మనాయక వెలమ సంక్షేమ మండలి అధ్యక్షుడు సాగర్‌రావు, ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్‌ రావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు సాగి రామారావు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులు, వారి సహాయకులకు ఉచితంగా భోజనం అందిస్తున్న శ్రీసత్యసాయి నిత్యాన్న ప్రసాద పథకానికి సంబంధించి పదేళ్ల వేడుకల్లో ఎమ్మెల్యే పాల్గొన్నా రు. రోగులు, సహాయకులకు భోజనం వడ్డించారు. రాయికల్‌ మండలం అల్లీపూర్‌, తాట్లావాయిలో ఇందిరమ్మ గృహప్రవేశంలో పాల్గొన్నారు. సర్పంచులు ఎంబారి గౌతమి, ఆకుల మల్లేశం, ఆత్మ చైర్మన్‌ గంగారెడ్డి, ఉపసర్పంచులు నారాయణ, గణేష్‌, సింగిల్‌ విండో చైర్మన్‌ ఏనుగు మల్లారెడ్డి, మాజీ ఎంపీపీ సంధ్యారాణి, శ్రీనివాస్‌ గౌడ్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement