జగిత్యాలజోన్: కేసీఆర్‌ను చాటుగా కలిసినప్పటి నుంచి జీవన్‌రెడ్డి ప్యాకేజీ మాటలు మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు కేసీఆర్‌ను విమర్శించి.. రేవంత్‌రెడ్డికి క్షీరాభిషేకం చేశారని, ఇప్పుడు రేవంత్‌రెడ్డిని, తనను ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. ఆయన మాటల్లో ద్వేషమే తప్ప విమర్శ లేదన్నారు. కొత్త బస్టాండ్ వద్దగల పెట్రోల్ బంక్‌కు జీవన్‌రెడ్డి హయాంలో ఇచ్చిన అనుమతులేనని గుర్తు చేశారు. జెడ్పీ మాజీ చైర్మన్‌పై విజిలెన్స్ కేసు పెట్టించారని, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడిని భూకబ్జాదారు అన్నారని పేర్కొన్నారు. పోలీస్ క్వార్టర్స్‌లో ఉన్న పెట్రోల్ బంక్ విషయంలో తాను ఆలస్యం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకొచ్చిన తర్వాత ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. 2008లో ఇందిరమ్మకాలనీకి శంకుస్థాపన చేసి మర్చిపోతే తాను ఇళ్లు కట్టించానని, బీఆర్‌ఎస్ హయాంలో అన్ని నియోజకవర్గాలకు 1500 డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేస్తే.. తాను 4500 తెచ్చానని తెలిపారు. ఇప్పుడు ప్రభుత్వంతో పనిచేస్తేనే అర్బన్ హౌసింగ్‌కాలనీకి రూ.34కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. తనపై ఎన్ని విమర్శలు చేసినా జగిత్యాలను అంతా అభివృద్ధి చేస్తానన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ సమిండ్ల వాణి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, పట్టణ అధ్యక్షుడు కొత్త మోహన్, సీనియర్ నాయకులు బండ శంకర్, కౌన్సిలర్లు ప్రశాంత్‌రావు, పిట్టల ధర్మరాజు, మాజీ వైస్ చైర్మన్ మన్సూర్, కప్పల శ్రీకాంత్ పాల్గొన్నారు.


