గ్రామాల అభివృద్ధికి కృషి
జగిత్యాలరూరల్: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజ య్‌కుమార్ అన్నారు. రూరల్ మండలం చెర్లపల్లిలో రూ.20లక్షలతో నిర్మించే పంచాయతీ భవనానికి గురువారం భూమిపూజ చేశారు. సర్పంచ్ వనిత, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ వరందన్, ఎంపీవో రవిబాబు, ఏఈ రాజమల్లయ్య, నక్కల రవీందర్‌రెడ్డి, ముకుందం, గంగారెడ్డి పాల్గొన్నారు.
మహిళా సమైక్య భవన నిర్మాణానికి..
బీర్‌పూర్ మండలం చెర్లపల్లిలో రూ.10లక్షలతో నిర్మించే మహిళాసమైక్య భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. స్వయం సహాయక గ్రూపుల ద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించారు. సర్పంచ్ మసీదు తిరుపతి, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేశ్, కేడీసీసీ మాజీ డైరెక్టర్ రాంచందర్‌రావు, ఉపసర్పంచ్ పట్టం స్వర్ణలత పాల్గొన్నారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్


