ఆమె చేతిలో పాలన | - | Sakshi
Sakshi News home page

ఆమె చేతిలో పాలన

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

ఆమె చేతిలో పాలన

ఆమె చేతిలో పాలన

జగిత్యాల: జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇందులో మూడు బల్దియాల్లో చైర్‌పర్సన్లుగా అతివలే కొలువుదీరారు. మహిళలకు కల్పించిన 50శాతం రిజర్వేషన్‌తోపాటు వారికి అనుకూలంగా ఉన్న ఇతర స్థానాల్లోనూ వార్డు కౌన్సిలర్లుగా పోటీ చేసి విజయం సాధించారు. రాజకీయాల్లో పురుషులకు తామేమీ తీసిపోమని, సమానంగా రాణిస్తామని నిరూపించారు. మహిళలు సాధికారత సాధించాలనే ఉద్దేశంతో అన్ని రంగాల్లో రాణించాలని ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా మహిళలు అడుగులు వేస్తున్నారు. పురుషులకన్నా ఎక్కువగా మహిళలే విజయం సాధిస్తున్నారు. చాలామంది రాజకీయాలకు కొత్త అయినప్పటికీ పాలన పట్టు తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు. జగిత్యాల మున్సిపాలిటీని పదేళ్లుగా మహిళలే ఏలుతున్నారు. ఇప్పుడూ బీసీ మహిళకు కేటాయించడంతో సమిండ్ల వాణి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు ఉండగా చైర్మన్‌ స్థానాలు జగి త్యాల బీసీ మహిళ, ధర్మపురి, కోరుట్ల జనరల్‌ మహి ళకు రిజర్వ్‌ అయిన విషయం తెల్సిందే. మెట్‌పల్లి, రాయికల్‌ చైర్మన్‌ను జనరల్‌కు కేటాయించారు. రాయికల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి మాత్రం మహిళలకు దక్కింది. రిజర్వ్‌ అయిన స్థానాలతోపాటు వార్డుస్థానాలనూ మహిళలే అత్యధికంగా గెలుచుకున్నారు. ఐదు బల్దియాల్లో 136వార్డులు ఉండగా. 76స్థానాల్లో గెలిచి చూపించారు. మెట్‌పల్లి మున్సిపాలిటీ ఈ సారి జనరల్‌కు రిజర్వ్‌ కావడంతో పురుషులకు అవకాశం దక్కింది. కానీ.. గతంలో జరి గిన ఎన్నికల్లో మహిళలే మున్సిపల్‌ చైర్‌పర్సన్లుగా రాణించారు. ఇక్కడ గతంలో ఎర్రోళ్ల నర్సు, ధర్మపురి నాగరాణి, సుశీల, ఉమారాణి, సుజాత చైర్‌పర్సన్లుగా కొనసాగారు.

అభివృద్ధి దిశగా మున్సిపాలిటీలు

సాధారణంగా మహిళలు వంటింటికే పరిమితం అవుతారన్న వాదన ఉంది. కానీ.. అది నిజం కాదని, అన్నింట్లోనూ రాణిస్తారని మహిళలు రుజువు చేస్తున్నారు. వ్యాపారాల్లోనే కాక రాజకీయాల్లోకి కూడా వచ్చి తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుత హైటెక్‌ యుగంలో ఎక్కువగా పురుషులు వారి స్థానాల్లో జనరల్‌ కోటాలో మహిళలనే పోటీ చేయించారు. దీంతో మహిళల ప్రాతినిథ్యం ఘననీయంగా పెరిగింది.

చైర్‌పర్సన్లపైనే ఆధారం

మహిళలు సాధికారత సాధించాలంటే మున్సిపాలిటీలను అభివృద్ధి దిశగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ముఖ్యంగా మున్సిపాలిటీలకు వచ్చే ఆదాయపు పన్నుకు అనుగుణంగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. ప్రతి బల్దియాలో ఆస్తిపన్ను, నల్లాపన్ను, భవన నిర్మాణాలకు సంబంధించిన ఆదాయం, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే 14వ ఆర్థిక సంఘం నిధులు, ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులు వస్తుంటాయి. వీటిని ప్రణాళికబద్ధంగా ఖర్చు చేస్తే అభివృద్ధి జరిగే అవకాశాలుంటాయి. ఆ దిశగా మహిళలు వెళ్తే అభివృద్ధి సాధించవచ్చు. అంతేకాకుండా స్వతంత్రంగా పాలించే అవకాశం తీసుకోవాలి. మహిళలు మున్సిపల్‌ పీఠాలు అధిరోహించినప్పటికీ ఎక్కువగా భర్తలు చాలామణి అవుతుంటారు. పట్టణాలను అభివృద్ధి చేసేది చైర్‌పర్సన్లపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి అధికార వ్యవహారాల్లో పురుషుల జోక్యం లేకుండా చూసుకుంటే బావుంటుందనేది పలువురి వాదన. ఇప్పటికే ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటూ వారి సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. వాటిని అర్హులకు అందేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉంటుంది. ఒంటరి మహిళలు, వింతువులు, అర్హులందరికీ పథకాలు అందించాలి. అవినీతిపై దృష్టి సారించాలి. నిధుల వినియోగంలో పారదర్శకత పాటించడంతోపాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపై అవగాహన కలిగి ఉండి సమస్యలపై ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది.

దృష్టి సారిస్తే ప్రగతి..

మహిళలు ప్రతి పనిపై దృష్టి సారిస్తే ప్రగతి సాధించవచ్చు. బల్దియాల్లో ఉద్యానవనం, చెరువుల అభివృద్ధి, వీధివ్యాపారులకు స్థలాలు, మురికికాలువలు, ప్లాస్టిక్‌ నియంత్రణ ఇలా ప్రతి ఒక్కటి చేపడితే మహిళలకు గుర్తింపు వస్తుంది.

బల్దియాల్లో మహిళలు, పురుషులకు దక్కిన వార్డులు

బల్దియాల్లో అతివలదే ఆధిపత్యం

ఐదు పురపాలికల్లో మూడుచోట్ల వారే..

రిజర్వేషన్‌ అవకాశాన్ని అందిపుచ్చుకున్న వైనం

పాలనపై దృష్టి సారిస్తే మారనున్న బల్దియాల ప్రగతి

జగిత్యాల : చెర్మన్‌ సమిండ్ల వాణి

వైస్‌ చైర్మన్‌ జీనత్‌ పర్విన్‌

కోరుట్ల : తిరుమల వసంత

ధర్మపురి : వేముల నాగలక్ష్మీ

రాయికల్‌ : వైస్‌ చైర్మన్‌ తురగ సౌజన్య

బల్దియా వార్డులు మహిళలు పురుషులు

జగిత్యాల 50 29 21

ధర్మపురి 15 7 8

కోరుట్ల 33 19 14

మెట్‌పల్లి 26 14 12

రాయికల్‌ 12 7 5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement