సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు
కరీంనగర్: కరీంనగర్ ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి అనిల్‌కుమార్ ఉత్తమ జర్నలిస్టు పురస్కారం అందుకున్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో ఈ పురస్కారాన్ని అందించారు. జర్నలిజంలో మెరుగై న సేవలకు ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. కరీంనగర్‌కు చెందిన సీనియర్ జర్నలిస్టులు తాడూరి కరుణాకర్, ప్రమోద్‌కుమార్ పురస్కారాలు అందుకున్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా ఈ పురస్కారాలు అందజేశారు.
బాల్య వివాహాలు నేరం
జగిత్యాలరూరల్: బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని సహాయ వెల్ఫేర్ అసోసియేషన్ స్వ చ్ఛంద సంస్థ కో–ఆర్డినేటర్ భూమేశ్ అన్నారు. సారంగాపూర్, బీర్‌పూర్, ధర్మపురి మండలాల్లో గురువారం అవగాహన కల్పించారు. బాల్య వివాహాలను అరికట్టేందుకు సమాజంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. బాల్య వివాహాలతో పిల్లల చదువు, ఆరోగ్యం, శారీ రక, మానసిక అభివృద్ధిపై ప్రతి కూల ప్రభా వం చూపుతాయన్నారు. కార్యక్రమంలో క మ్యూనిటీ మొబిలైజర్లు లత, శ్యామల, లహరి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు చల్‌గల్ విద్యార్థులు
జగిత్యాలరూరల్: జగిత్యాలరూరల్ మండలం చల్‌గల్ జెడ్పీ పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలకు ఎంపికై నట్లు పీడీ వెంకటలక్ష్మీ తెలిపారు. నారాయణపేట జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు జిల్లా జట్టు తరఫున రిషిత, హన్మకొండలో జరిగే అథ్లెటిక్స్ పోటీల్లో కౌశిక్ పాల్గొననున్నారు. విద్యార్థులను గురువారం ప్రధానోపాధ్యాయురాలు లతాదేవి, పాఠశాల చైర్మన్ నీరటి సుకన్య, సర్పంచ్ జున్ను రాజేందర్, ఉపాధ్యాయులు అభినందించారు.
మల్యాల గురుకులం విద్యార్థులు
మల్యాల: మండలంలోని తాటిపల్లి బాలికల గురుకులానికి చెందిన విద్యార్థులు సీఎం కప్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మానస తెలిపారు. కబడ్డీ పోటీలకు యశస్విని, నిత్యశ్రీ, ఖోఖో పోటీలకు సంజన, వాలీబాల్ పోటీలకు అస్మిత, అక్షిత, అథ్లెటిక్స్‌లో మేఘన, జరా ఫాతిమా, హారిక ఎంపికయ్యారు. వీరిని ప్రిన్సిపాల్ మానస, పీఈటీ మధులిక అభినందించారు.
ఆర్‌వోలు, పీఆర్‌వోలకు గౌరవ వేతనం
కోరుట్ల: మున్సిపల్ ఎన్నికల్లో ఆర్‌వో, పీఆర్‌వోలుగా పనిచేసిన ఉద్యోగులకు గౌరవ వేతనం విడుదలలో జాప్యం కావడంతో ‘ఇదేనా ఎన్నికల..గౌరవం’శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆర్‌వోలుగా విధులు నిర్వర్తించిన వారికి 18 రోజులకుగాను రూ.10వేలు, పీఆర్‌వోలకు రూ.8వేల గౌరవ వేతనం మంజూరు చేశారు.
సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు
సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు
సాక్షి బ్యూరో ఇన్‌చార్జికి ఉత్తమ జర్నలిస్టు అవార్డు


