కనులపండువగా శివపార్వతుల కల్యాణం | - | Sakshi
Sakshi News home page

కనులపండువగా శివపార్వతుల కల్యాణం

Feb 20 2026 6:40 AM | Updated on Feb 20 2026 6:40 AM

కనులప

కనులపండువగా శివపార్వతుల కల్యాణం

రాయికల్‌: రాయికల్‌ పట్టణంలో మత్స్యపారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో.. గంగమ్మతల్లి ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల కల్యాణ మహోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. అర్చకులు మల్లికార్జున్‌ ఆధ్వర్యంలో ఆలయంలోని ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టారు. ఆలయ చైర్మన్‌ దేవుని నారాయణ, మున్సిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ తురగ సౌజన్య, కౌన్సిలర్లు తోపారపు ప్రశాంతి, కూనారపు మానస, కల్లెడ ధర్మపురి, పల్లికొండ గంగాధర్‌, సంఘ అధ్యక్షుడు తోపారపు రవీందర్‌, భూమేశ్‌, నాయకులు పల్లికొండ పోచయ్య, రమేశ్‌, రంజిత్‌, సురేశ్‌ పాల్గొన్నారు.

కనులపండువగా శివపార్వతుల కల్యాణం1
1/1

కనులపండువగా శివపార్వతుల కల్యాణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement