సదర్‌మాట్‌ను సందర్శించిన మంత్రి జూపల్లి
ఇబ్రహీంపట్నం: మండలంలోని మూలరాంపూర్ శివారులో గోదావరిపై నిర్మించిన సదర్‌మాట్ ప్రాజెక్ట్, బ్రిడ్జిని మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం సందర్శించారు. ఈనెల 16న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నందున అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్ట్ ఆయకట్టు వివరాలను ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు సుదర్శన్‌రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే ఎడ్మ బొజ్జు, నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్, నిర్మల్ మాజీ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
ధర్మపురి: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాదవ్ వెంకట్రావు అన్నారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కలిశారు. ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఉపాధ్యాయుల సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. 342 జీవో సవరించాలని, పదోన్నతులకు అడ్డంకిగా ఉన్న అడాక్వసి అనే పదాన్ని తొలగించాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. కార్యక్రమంలో వివిధ జిల్లాల అధ్యక్షులు భూక్య రాజేశ్ నాయక్, సురేష్‌నాయక్, దూడ రాజనర్సు తదితరులున్నారు.
ఘనంగా అయ్యప్ప పడిపూజ
ధర్మపురి: పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో పడిపూజ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. మకరసంక్రాంతి, శబరిమలలోని పొన్నాంబలంపై మకరజ్యోతి దర్శనం సందర్భంగా గురుస్వాములు పెండ్యాల బాలకృష్ణస్వామి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. పదనెట్టాంబడి వెలిగించారు. ఆలయ వ్యవస్థాపకులు భీమనాతి మంగఅశోక్, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
సదర్‌మాట్‌ను సందర్శించిన మంత్రి జూపల్లి


