నల్లానీరు అందించాలి
మా గ్రామంలో ఇంటింటికీ నల్లానీళ్లు రాక ఏళ్లు గడుస్తోంది. బోరుబావులతో నీటి అవసరాలు తీర్చుకుంటున్నం. ఈ విషయం అధికారులకు తెలిసినప్పటికి నిర్లక్ష్యం చేస్తుండడం దారుణం. పలు వాడల్లో పైపులు లీకేజీ అయితే మరమ్మతు చేయక వదిలేశారు. ట్యాంకుల నుంచి అన్ని వాడలకు కొత్త పైపులైన్ వేసి సమస్య పరిష్కరించాలి. – దొనకంటి రాజు, ఇప్పపెల్లి
మరమ్మతు చేయిస్తాం
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లానీళ్లు అందించడమే లక్ష్యం. ఇప్పపెల్లి, ఊట్‌పెల్లి గ్రామాల్లో పర్యటించి పైపులైన్‌ను పరిశీలిస్తాం. పైపులైన్ లీకేజీలుంటే మరమ్మతు చేయిస్తాం. గ్రామాల్లో నీటి సమస్యలుంటే ప్రజలు అధికారుల దృష్టికి తీసుకురావాలి. పరిష్కారానికి కృషి చేస్తాం.
– చంద్రశేఖర్, ఆర్‌డబ్ల్యూఎస్ ఏఈ, కథలాపూర్
నల్లానీరు అందించాలి


