కృష్ణా జలాలపై చిత్తశుద్ధితో ఉన్నాం
ధర్మపురి: కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. కృష్ణా జలాల అంశాన్ని బీఆర్‌ఎస్ కావాలనే తప్పుదోవ పట్టిస్తోందని, అసెంబ్లీలో చర్చిస్తుంటే కేసీఆర్, కేటీఆర్ పారిపోయారని పేర్కొన్నారు. పాలనలో విఫలమై ప్రజల ప్రశ్నలకు జవాబు చెప్పలేని బీఆర్‌ఎస్ నాయకులు అబద్దాల రాజకీయాలకు దిగుతున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాలనలో ఉన్నదంతా దోచుకున్నారని, సర్పంచ్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినా మార్పు రావడం లేదని విమర్శించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను పూర్తిగా తిరస్కరించబోతున్నారని తెలిపారు. ఆయన వెంట నాయకులు దినేశ్, వివిద మండలాల నాయకులు ఉన్నారు.


