బహుళ ప్రయోజన పంటల సంరక్షణ పరికరం..
బహుళ ప్రయోజన పంటల సంరక్షణ పరికరం ద్వారా రైతులు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం అందిస్తుంది. ఈ పరికరానికి అమర్చిన ఫ్యాన్ గాలి దిశలో తిరుగుతూ శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ శబ్దంతో కోతులు, పక్షులు పంటల వద్దకు రాకుండా భయపడతాయి. రాత్రివేళలో సౌరశక్తితో పనిచేసే దీపం వల్ల కీటకాలు ఆకర్షితమై కిరోసిన్ నీటితో నింపిన టబ్‌లో పడి చనిపోతాయి. రాత్రివేళ అడవిపందుల బెడద నుంచి కాపాడుకోవచ్చు. రైతులకు ఇది ఎంతో ఉపయోగపడే ప్రాజెక్ట్.
– విశ్వనాథం వాగ్దేవి


