ఓబన్నకు నివాళి
జగిత్యాలటౌన్: వడ్డె ఓబన పోరాట యోధుడు అని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. ఓబన 219వ జయంతిని జిల్లాకేంద్రంలో ఆదివారం నిర్వహించారు. ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి ఈస్ట్ ఇండియా కంపనీపై తిరుగుబాటు చేసినప్పుడు సైన్యాధిపతిగా ఉన్న ఓబన అన్నివర్గాలను కలుపుకొని బ్రిటీష్ వారిపై ఉద్యమించారని గుర్తు చేశారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, జున్ను రాజేందర్, వల్లెపు మొగిలి, ఎల్లయ్య, యాదగిరి, వడ్డెర నాయకులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో..
ఓబన జయంతిని కలెక్టరేట్‌లో అధికారికంగా నిర్వహించారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, అదనపు కలెక్టర్ రాజాగౌడ్, అధికారులు పాల్గొని నివాళి అర్పించారు. మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, వల్లెపు మొగిలి, ముసిపట్ల లక్ష్మీనారాయణ, బాపిరాజు, గంగాధర్, కప్పల శ్రీకాంత్, ప్రవీణ్ పాల్గొన్నారు.
యువతరానికి ఆదర్శం అలిశెట్టి సాహిత్యం
● సినీ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్
జగిత్యాలజోన్: యువతరానికి అలిశెట్టి సాహిత్యం ఆదర్శంగా నిలిచిందని సినీ కథా రచయిత పెద్దింటి అశోక్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కళాశ్రీ ఈశ్వరమ్మ సాహిత్య పీఠం ఆధ్వర్యంలో అక్షరసూరీడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. అలిశెట్టి సాహిత్య అవార్డులను ఉరిమల్ల సునంద, లక్కరాజు శ్రీ లక్ష్మి, మేరుగు అనురాధ, మాడురి అనిత, కోరుకంటి కిరణ్మయి, మద్దెల ప్రభాకర్, నవీన్‌కు అందించారు. కార్యక్రమంలో గుండేటి రాజు, మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ అడువాల జ్యోతి, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజెంగి నందయ్య, ప్రముఖ కథా రచయిత కేవీ.నరేందర్, ఉపాధ్యాయ సంఘ నాయకులు ఆనందరావు, అమర్నాథ్ రెడ్డి, టీవీ.సూర్యం, డాక్టర్ సునీత, వంగ గీతారెడ్డి పాల్గొన్నారు.
కోరుట్ల మున్సిపల్‌పై బీజేపీ జెండా ఎగరేయాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు
కోరుట్ల: మున్సిపాలిటీ ఎన్నికల్లో అత్యధిక కౌన్సిలర్ స్థానాలు కై వసం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు అన్నారు. ఆదివారం పట్టణంలో ఎన్ని కల సన్నాహక సమావేశంలో సీనియర్ నాయకుడు చిట్నేని రఘుతో కలిసి మాట్లాడారు. కార్యకర్తలు, నాయకులు సమష్టిగా కృషి చేసి బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ఓబీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్, నాయకులు రాజేందర్, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
ఓబన్నకు నివాళి
ఓబన్నకు నివాళి


