కాంగ్రెస్‌తోనే అభివృద్ధి
గోదావరిఖని: ‘ఇంటిపోరును చక్కదిద్దుకోని మీరు ప్రజలకేం న్యాయం చేస్తార’ని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నగరంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఆదివారం జరిగగిన బహిరంగ సభలో పొంగులేటి మాట్లాడారు. పేదల ఆత్మగౌరవం కాపాడేందుకు రూ.22,500 కోట్లతో రాష్ట్రంలో 4.5లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో 67శాతం కాంగ్రెస్ మద్దతుదారులను గెలిపించిన ప్రజలు రాష్ట్రప్రభుత్వానికి మద్దతు పలికారని అన్నారు. ట్రాన్స్‌జెండర్లకు తొలిసారి రామగుండంలోనే ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని తెలిపారు. దివంగత సీఎం వైఎస్సార్ 76 జీవో జారీచేయగా.. పదేళ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదని దుయ్యబట్టారు. ఈ జీవో ప్రకారం సింగరేణి ప్రాంతంలో పేదల ఇళ్లకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో అదనంగా ఎమ్మార్వో కార్యాలయాలు ఏర్పాటు చేస్తామని, పాత్రికేయుల సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మొండి గోడలుగా మిగిలిన 633 డబుల్ బెడ్రూమ్ ఇళ్లనుపూర్తిచేస్తున్నామని, అసంపూర్తిగా మిగిలిన మరో 300 ఇళ్లకు నిధులు కేటాయిస్తామని తెలిపారు.
ఇంట్లో చిచ్చు ఆర్పలేనివారు ప్రగల్భాలు పలుకుతున్నారు
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యలు


