కళాసిల్క్‌ చేనేత హస్తకళ మేళాకు ఆదరణ | - | Sakshi
Sakshi News home page

కళాసిల్క్‌ చేనేత హస్తకళ మేళాకు ఆదరణ

Apr 26 2025 12:49 AM | Updated on Apr 26 2025 12:49 AM

కళాసిల్క్‌ చేనేత హస్తకళ మేళాకు ఆదరణ

కళాసిల్క్‌ చేనేత హస్తకళ మేళాకు ఆదరణ

కరీంనగర్‌కల్చరల్‌: కరీంనగర్‌లోని శ్రీరాజరాజేశ్వర కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కళాసిల్క్‌ చేనేత హస్తకళ మేళాకు విశేష ఆదరణ లభిస్తోంది. మేళాలో పట్టు, ఫ్యాన్సీ డిజైనర్‌, పోచంపల్లి చీరలు, డ్రస్‌ మెటీరియల్స్‌, చుడీదార్స్‌, సూటింగ్స్‌ షర్టింగ్స్‌, జ్యువెల్లరీ, బెడ్‌ షీట్స్‌ అందుబాటులో ఉన్నాయని నిర్వాహకుడు వినోద్‌ నేగి తెలిపారు. అలాగే ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారి, ఉప్పాడల్లో ప్రఖ్యాతి పొందిన చీరలు అందుబాటులో ఉన్నాయన్నారు. హర్యానా బెడ్‌, కుషన్‌ కవర్లు, లక్నో కుర్తీస్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌, డోర్‌ కార్టన్స్‌, స్టోన్‌ జ్యువెల్లరీ, పెరల్స్‌, క్రాఫ్ట్‌స్‌, బంజారా, కోల్‌ కత్తా బ్యాగులు, ఒడిస్సా పెయింటింగ్స్‌ , మధ్యప్రదేశ్‌ చందేరి, మహేశ్వరి, రాజస్తాన్‌ కోటా బాందేజన్‌, బ్లాక్‌ప్రింట్స్‌, సంగ్నరి ప్రింట్స్‌, డ్రెస్‌ మెటీరియల్స్‌, ఉత్తరప్రదేశ్‌ జామ్దాని, బనారస్‌ లక్నొవి డ్రెస్‌ మెటీరియల్స్‌ పాటు పలు రకాల వస్తువులు సరసమైన ధరలకు లభిస్తాయని తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకు మేళా అందుబాటులో ఉంటుందని, ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement