
ఇష్టారాజ్యంగా మార్కెట్ ఫీజు
మామిడి మార్కెట్‌లో ఇష్టారాజ్యంగా మార్కెట్ పీజు వసూలు చేస్తున్నారు. ఎంత కాయ కొంటున్నారు..? ఎంత వసూలు చేస్తున్నారు..? ఎవరికీ తెలియదు. మార్కెట్ ఫీజు బుక్కులు చివరకు వ్యాపారులకే ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. ఈ సారి అలా జరగకుండా చూడాలి.
– బందెల మల్లయ్య, చల్‌గల్, రైతు
పకడ్బందీగా వసూలు చేస్తాం
గతంలో జరిగిన పొరపాట్లు జరగకుండా.. ఈసారి పకడ్బందీగా మార్కెట్ ఫీజు వసూలు చేస్తాం. మార్కెట్ కమిటీ పర్యవేక్షణలో ఉండేందుకే ఏ వ్యాపారికి కూడా మార్కెట్ బయట క్రయ విక్రయాలు చేసేందుకు అనుమతి ఇవ్వడం లేదు. ప్రతిరోజూ వ్యాపారుల దుకాణాలు పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేస్తాం. – రాజశేఖర్, మార్కెట్ కార్యదర్శి, జగిత్యాల

ఇష్టారాజ్యంగా మార్కెట్ ఫీజు